Home / Ram Mandir
సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన మొదటి రోజు అయోధ్మ రామాలయంలో భక్తులు రూ. 3 కోట్లకు పైగా విరాళాలు అందించారని ఆలయ ట్రస్ట్ తెలిపింది.రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ, ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ ట్రస్ట్ ఇన్ఛార్జ్ అనిల్ మిశ్రా సోమవారం 'ప్రాణ్ ప్రతిష్ట' తర్వాత 10 విరాళాల కౌంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు.
శతాబ్దాల ఓర్పు, లెక్కేలేనన్ని త్యాగాలు, తపస్పు తరువాత మన శ్రీరాముడు వచ్చాడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అనంతరం ఆయన ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామమందిరం నిర్మాణం భారత సమాజంలో సహనం, శాంతి మరియు సామరస్యానికి ప్రతీకగా వర్ణించారు.
అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేశారు.అనంతరం బాలరాముడికి ప్రధాని తొలి హారతి ఇచ్చారు.
జనవరి 22న జరగనున్న రామమందిర 'ప్రాణప్రతిష్ఠ'కు ముందు బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామజన్మభూమి ఆలయ గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ఉంచారు.
లక్షలాది మంది భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. అయోధ్యలో గురువారం కొత్తగా నిర్మించిన రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ఉంచారు.మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలోకి తీసుకువచ్చారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో ప్రత్యేకంగా శాకాహార వంటకాలను అందించే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏడు నక్షత్రాల హోటల్‌ను నిర్మించాలనే ప్రతిపాదన రాష్ట్రానికి అందిందని ప్రకటించారు.అయోధ్యలో హోటళ్లను ఏర్పాటు చేసేందుకు 25 ప్రతిపాదనలు అందాయి. స్వచ్ఛమైన శాకాహార సెవెన్ స్టార్ హోటల్‌ను నిర్మించాలనేది ప్రతిపాదనల్లో ఒకటి అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
ఈనెల జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఒకవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు ఆలయ ట్రస్టు సభ్యులు ప్రముఖుల్ని ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు.
ఆస్ట్రేలియాలో వరుస దాడుల తర్వాత, కెనడాలో ఈసారి కొన్ని ఖలిస్తానీ శక్తులు మరో హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి