Home / Political News
బూతులు మాట్లాడం లో పోటీ పడుతున్న నేతలు..వైసీపీ పై జనసేన పంచులు
దాడిశెట్టి కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన వైసీపీ..చంద్రబాబు పై షాకింగ్ వర్డ్స్
ఎన్టీఆర్ పై కామెంట్స్..దాడిశెట్టి పై టీడీపీ మాటల దాడి
షర్మిల హద్దుల్లో ఉండాలి. వైయస్ పరువు తీయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. నన్ను వ్యభిచారి అంటావా? అంటూ అంటూ షర్మిల పై మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను వ్యభిచారి అంటే ఏమీ కాదని, కానీ అదే మాట తానంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు విధేయులైన 90 మందికి పైగా రాజస్థాన్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ అధ్యక్షపదవిరేసునుంచి అశోక్ గెహ్లాట్ తొలగించబడ్డారు.
ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జియార్జియా మెలోని బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. నేషనలిస్ట్ బ్రదర్స్ పార్టీ నేత అయిన మెలోని, ఆదివారం జరిగిన జాతీయ ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ విషయాన్ని వెల్లడించాయి.
దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్బవించింది. కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సొంత పార్టీని స్థాపించారు. తన రాజకీయ పార్టీ పేరును ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’గా ప్రకటించారు.
ఏపిలో ఆరోగ్య విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తప్పు బట్టారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్, ఆయన పేరు మార్పును ఎవ్వరూ అంగీకరించరు, నేను ఖండిస్తున్నానంటూ కుండ బద్దలు కొట్టిన్నట్లు తెలిపారు.
రాజాసింగ్ కు ప్రాణ హాని ఉందని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిడియాక్ట్ కింద జైల్లో ఉన్న ఎమ్మెల్యేను కలిసేందుకు జైలు అధికారులు ములాఖత్ కు అనుమతించక పోవడాన్ని తప్పుబట్టారు
భాజాపాయేతర ప్రభుత్వమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎంతో ముఖ్యం. ఈ నేపధ్యంలో ఏఐసిసి అధినేత్రి సోనియాగాంధీని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇరువరు కలిసారు