Last Updated:

Giorgia Meloni: ఇట‌లీ తొలి మ‌హిళా ప్రధానిగా జియార్జియా మెలోని

ఇట‌లీ తొలి మ‌హిళా ప్రధానిగా జియార్జియా మెలోని బాధ్యత‌లు స్వీక‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. నేష‌న‌లిస్ట్ బ్రదర్స్ పార్టీ నేత అయిన మెలోని, ఆదివారం జ‌రిగిన జాతీయ ఎన్నిక‌ల్లో ఆధిక్యాన్ని సాధించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ విష‌యాన్ని వెల్లడించాయి.

Giorgia Meloni: ఇట‌లీ తొలి మ‌హిళా ప్రధానిగా జియార్జియా మెలోని

Italy: ఇట‌లీ తొలి మ‌హిళా ప్రధానిగా జియార్జియా మెలోని బాధ్యత‌లు స్వీక‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. నేష‌న‌లిస్ట్ బ్రదర్స్ పార్టీ నేత అయిన మెలోని, ఆదివారం జ‌రిగిన జాతీయ ఎన్నిక‌ల్లో ఆధిక్యాన్ని సాధించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ విష‌యాన్ని వెల్లడించాయి. మాలియో స‌ల్విని లీగ్‌, సిల్వియో బెర్లుస్కూనీ ఫోర్జా ఇటాలియా పార్టీలతో కూడిన కూట‌మి 43 శాతం ఓట్లను గెలుచుకుంది. దీంతో సేనేట్‌లో ఆ పార్టీ 114 సీట్లను సొంతం చేసుకునే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిట‌న్ క‌న్జర్వేటివ్‌ల త‌ర‌హాలో తాము పాల‌న కొన‌సాగించ‌నున్నట్లు మెలోని తెలిపారు.

ఉక్రెయిన్ అంశంలో ప‌శ్చిమ దేశాల విధానాల‌కు అండ‌గా నిల‌వ‌నున్నట్లు ఆమె వెల్లడించారు. ఇంధ‌న కొర‌త కొత్త ప్రభుత్వానికి స‌మ‌స్యగా మారే అవ‌కాశాలు ఉన్నాయి. యూరోప్‌లోని రైట్ వింగ్ నేత‌లంద‌రూ మెలోని విజయాన్ని మెచ్చుకుంటున్నారు. బ్రద‌ర్స్ ఆఫ్ ఇట‌లీ పార్టీకి దాదాపు 26 శాతం ఓట్లు పోలైన‌ట్లు తెలుస్తోంది. దీంతో మెలోని తొలి మ‌హిళా ప్రధాని అయ్యే ఛాన్సు ఉంది. మెలోని కూట‌మి పార్టీలు కూడా ఉభ‌య‌స‌భ‌ల్లో కీల‌క సీట్లను గెలుచుకున్నాయి.

ఇవి కూడా చదవండి: