Home / PM Narendra Modi
ప్రధాని నరేంద్రమోదీతో జనసేనాని పవన్ కల్యాణ్ ఏకాంత భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విశాఖ సాగరతీరాన జరిగిన ఈ సమావేశం, ఏపీలో అనేక రాజకీయ మార్పులకు దారి తీసే అవకాశం ఉందా? పవన్‌ను పిలిపించుకొని మరీ ప్రధాని మాట్లాడటం దేనికి సంకేతం? ఈ భేటీతో పవన్ ఇమేజిని మోదీ అమాంతం పెంచేశారా?
సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు పరం చెయ్యదని ఆ ఆలోచన కూడా లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం ఎన్టీపీసీ టౌన్ షిప్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా ప్రధాని మోదీని అడ్డుకోలేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బేగంపేట విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మోడీకి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీకి స్వాగతం పలుకుతున్నారని అన్నారు.
తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలోనే అంధకారం పోతుందని, కొత్త సూర్యోదయం రాబోతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కొందరు నాయకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ పొన్నియిన్ సెల్వన్ నవలను బహుమతిగా ఇచ్చారు. శుక్రవారం దిండిగల్ లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ (జిఆర్ఐ) 36వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానికి స్టాలిన్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం. కాగా అందరిలో మోడీ , పవన్ తో ఏం మాట్లాడారు? లోకల్ బీజేపీతో ఉన్న సమస్యలను గతంలో పవన్ లేవనెత్తారు. మరిప్పుడు ఇవే సమస్యలు ఇప్పుడు మోదీ ముందు ఉంచారా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు బెంగళూరు విమానాశ్రయం యొక్క టెర్మినల్ 2ని ప్రారంభించారు. ఈ మానాశ్రయం దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయం ర్యాంకుల్లో చేరనుంది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆయనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అవుతారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన గురించి ముందుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపామని కేంద్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.