Home / palnadu district
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవదహనం అయ్యారు. బాపట్ల జిల్లా పర్చూరు -చిలకలూరిపేట హైవేపై.. టిప్పర్ లారీ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొనడంతో.. క్షణాల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడ్డాయి.
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని జనసేన కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. నేడు దాచేపల్లిలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొనున్నారు.
టీడీపీ సభల్లో వరుస మరణాల తర్వాత నియంత్రణా చర్యల కింద ఏకంగా రోడ్ షోలనే రద్దు చేస్తూ జీ.వో జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం. దీనిపై రాజకీయ పార్టీలు స్పందిస్తూ పలు విమర్శలు గుప్పించాయి.
పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు తీరును నిరసిస్తూ బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి ధర్నాకు దిగారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు(నవంబర్ 11) గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల అయ్యింది.
ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పుట్టిన బిడ్డకు బొడ్డుతాడు కట్ చెయ్యాల్సింది పోయి చిన్నారి చిటికెన వేలుని కత్తించారు ఆ నిర్లక్ష్యపు వైద్యులు. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లాలోని మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు రాజీవ్ సాయి అనే ఎనిమిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన చిలకలూరిపేటలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలె పెళ్లి భాజలు మోగిన ఆ ఇంట్లో నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతుంది.