Last Updated:

Kidnap: చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్.. నెల్లూరులో ఆచూకి..!

పల్నాడు జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు రాజీవ్ సాయి అనే ఎనిమిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన చిలకలూరిపేటలో చోటుచేసుకుంది.

Kidnap: చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్.. నెల్లూరులో ఆచూకి..!

Kidnap: పల్నాడు జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు రాజీవ్ సాయి అనే ఎనిమిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన చిలకలూరిపేటలో చోటుచేసుకుంది.

చిలకలూరిపేట నుంచి వెళ్లి చెన్నైలో ధాన్యం వ్యాపారం చేస్తూ ఓ కుటుంబం జీవనం సాగిస్తుంది. కాగా దసరా పండుగ సందర్భంగా ఆ కుటుంబం చెన్నై నుంచి స్వగ్రామం అయిన పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటకు వచ్చారు. పట్టణంలోని 13వ వార్డులో ఉన్న ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేస్తున్న సమయంలో రాజీవ్ అనే ఎనిమిదేళ్ల బాలుడుని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కాగా రాజీవ్ తల్లిందండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ కుమారుడు కిడ్నాప్ అవ్వడంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదిలా ఉండగా కిడ్నాప్‌కు గురైన రాజీవ్ సాయిని నెల్లూరు జిల్లా కావలి వద్ద దుండగులు కారులో వదిలివెళ్లారు. కావలి వద్ద రాజీవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాలుడి క్షేమ సమాచారాన్ని పోలీసులు చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. కావలి నుంచి బాలుడిని చిలకలూరిపేటకు తీసుకువచ్చారు. దీనితో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది.

ఇదీ చదవండి: విడదల రజిని పై మండిపడుతున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

ఇవి కూడా చదవండి: