Home / national news
అయ్యప్ప దర్శనానికి వెళ్లివస్తోండగా కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వస్తోన్న ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలు అయ్యాయని అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నడిరోడ్డుపైనే జుట్టుజుట్టు పట్టుకుని పొట్టుపొట్టున కొట్టుకున్నారు. వారి స్నేహితులు ఇద్దరిని విడదీసేందుకు ప్రయత్నించినా వారు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్‌లోని గంగాపూర్ రోడ్డులోని ఓ కళాశాలలో చోటుచేసుకుంది.
కేరళలోని కొచ్చిలో కామాంధులు రెచ్చిపోయారు. రన్నింగ్ కారులో 19 ఏళ్ల మోడల్ పై అత్యాచారానికి ఒడిగట్టారు. గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
పలుకేసుల్లో వివిధ మంత్రులకు కోర్టులు ఇటీవల కాలంలో అరెస్ట్ వారెంట్ జారీ చెయ్యడం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ కు కళ్యాణదుర్గం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు చోరీ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన రెండు రోజులకే మరో కేంద్ర మంత్రికి పశ్చిమ బెంగాల్‌లోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా కనీసం 12 మంది మరణించారు.
శుక్రవారం జారీ చేసిన ముసాయిదా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులో ప్రతిపాదించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వం జరిమానా మొత్తాన్ని రూ.500 కోట్ల వరకు పెంచింది.
వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి భారతీయ పౌరులు ఇకపై పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీలోని సౌదీ రాయబార కార్యాలయం ప్రకటించింది
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందరినీ విడుదల చేసేందుకు అనుమతిస్తూ నవంబర్ 11న ఇచ్చిన ఉత్తర్వులపై నరేంద్ర మోదీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
యాపిల్‌వాచ్ మరో ప్రాణం కాపాడింది. 150 అడుగుల లోయలో పడిపోయిన బాలుడి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసి, ఊపిరి ఆగకుండా చూసింది.
నోయిడా నగరంలోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లిఫ్ట్‌లో పెంపుడు కుక్క 6 ఏళ్ల చిన్నారిని కరిచినందుకు గ్రేటర్ నోయిడా అథారిటీ పెంపుడు యజమానికి రూ.10,000 జరిమానా విధించింది.