Home / Munugodu
తెలంగాణాలో నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల బరిలో 47మంది అభ్యర్ధులు నిలిచారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు రూపంలో దక్కించుకున్న రూ. 18 వేల కోట్లను మునుగోడు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తే.... తాము మునుగోడు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న అనగా సోమవారం ప్రధాన పార్టీలు అయిన తెరాస, భాజపా, కాంగ్రెస్ నేతులు నామినేషన్ వేసిన విషయం విదితమే. కాగా నామినేషన్లు వేసినరోజు రాత్రే చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించి ఉండడం కలకలం రేపుతుంది.
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుందట.. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు రాకపోవచ్చని భావించిన నేతలకు ఎన్నికల సంఘం ఒక్కసారి షాక్ ఇచ్చింది.. షెడ్యూల్ విడుదల చేసి ఒక దెబ్బకి రెండు పిట్టలను కొట్టిందని చర్చించుకుంటున్నారు
ప్రజాగాయకుడు గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గద్దర్ బరిలో దిగనున్నారు.ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తీర్మానంపై సంతకం చేశారు
మునుగోడు ఉప ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని, కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరపాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు భాజపా విజ్నప్తి చేసింది. హైదరాబాద్ బుద్ధభవన్ లో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేశారు.
మునుగోడు నియోజవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. నవంబర్ 3న ఉపఎన్నికను చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలో భాజపా జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాదుకు చేరుకొన్నారు. ఆ పార్టీ నేతలతో సమావేశమైనారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో బన్సల్ పలు అంశాలను కీలక నేతల ముందుంచారు
మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు. నోటిఫికేషన్ కూడా రాలేదు. కానీ రాజకీయపార్టీలన్నీ మునుగోడుపై ఫుల్ ఫోకస్ చేశాయి. ప్రధాన పార్టీలకు అక్కడ గెలుపు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.