Home / Munugodu
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కోవర్ట్ ఆపరేషన్ పనికిమాలిన చర్యగా ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసారి అనసూయ (సీతక్క) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ప్రజలను పలకరిస్తున్న సీతక్క వెంకటరెడ్డి చర్యలను బహిరంగంగానే దుయ్యబట్టారు.
నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలకు సర్వం సిద్దం చేసిన్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ రోహిత్ సింగ్ మీడియాతో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల మేర నాకా బంద్ (చెక్ పోస్టు)లో ఇప్పటివరకు రూ. 1,48,44,160 స్వాధీనం చేసుకొన్నామన్నారు.
అధికార బలం, తాయిలాలు, హామీలు మాటున మునుగోడు ఉప ఎన్నికల్లో పలు పార్టీలు పోటా పోటీలు పడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు, ములుగు శాసనసభ్యురాలు ధనసారి అనసూయ (సీతక్క) మాత్రం తనదైన శైలిలో ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు దండుపాళ్యం ముఠాలెక్క ఇక్కడే పాగా వేసిండ్రు అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
మునుగోడు ఉపఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు టీఆర్‌ఎస్ గూటికి చేరుతున్నారు. గతంలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, దాసోజ్ శ్రవణ్, స్వామిగౌడ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి బాధ కలిగిస్తోందని, మాట్లాడటానికి కూడ ఏమీ లేదని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి అన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో నిలవగా, తమ్ముడికి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కొన్ని గుర్తులను తొలగించేలా ఎన్నికల కమీషన్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.