Home / Munugode Politics
తెలంగాణాలో నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల బరిలో 47మంది అభ్యర్ధులు నిలిచారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నెల 15న కుటుంబంతో సహా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Munugode:మునుగోడులో ఏకంగా పొటేళ్లు, మేకలను బహుమతిగా ఇస్తున్న రాజకీయ పార్టీలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పుడు ఆ ఉపఎన్నికే కమ్యూనిస్టుల్లో కల్లోలం రేపుతోందా.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టుగా కమ్యూనిస్టులు ‘ఎర్ర గులాబీ’లుగా మారారా..? అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు 30 ఏండ్ల పాటు మునుగోడు నియోజకవర్గాన్ని శాసించిన భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)కి ఏం అయ్యింది.
రంగంలోకి ప్రియాంక.. భారీ బహిరంగ సభకు ప్లాన్..? | Terachatu Rajakiyam | Prime9 News
ఇప్పటి వరకు ఏ ఉప ఎన్నిక అయినా ట్రబుల్ షూటర్ హరీష్ రావు లేదా మంత్రి కేటీఆర్‌కు భాద్యతలు అప్పజెప్పేవారు గులాబీ బాస్. అయితే మునుగోడు భాధ్యత మంత్రి జగదీష్ రెడ్డి భుజాలపైనే పెట్టారు. ఆ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక మంత్రికి కత్తి మీద సాములా మారిందా?
తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన ఖరారైంది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ తెలిపారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. తాను చేసిన హోంగార్డ్ ప్రస్తావనపైనా రేవంత్ రెడ్డి క్షమామణ చెప్పారు. అద్ధంకి చేసిన వ్యాఖ్యలను బాధ్యత వహిస్తూ తాను సారీ చెబుతున్నానని చెప్పారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన కొన్ని పోస్టర్ల కలకలం రేపుతున్నాయి.
ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్టు టీఆర్ఎస్ నేతలు సంకేతాలు ఇవ్వడంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.