Last Updated:

Munugode By Poll: ఉప ఎన్నిక మంత్రికి కత్తి మీద సాములా మారిందా?

ఇప్పటి వరకు ఏ ఉప ఎన్నిక అయినా ట్రబుల్ షూటర్ హరీష్ రావు లేదా మంత్రి కేటీఆర్‌కు భాద్యతలు అప్పజెప్పేవారు గులాబీ బాస్. అయితే మునుగోడు భాధ్యత మంత్రి జగదీష్ రెడ్డి భుజాలపైనే పెట్టారు. ఆ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక మంత్రికి కత్తి మీద సాములా మారిందా? 

Munugode By Poll: ఉప ఎన్నిక మంత్రికి కత్తి మీద సాములా మారిందా?

Munugode By Poll: ఇప్పటి వరకు ఏ ఉప ఎన్నిక అయినా ట్రబుల్ షూటర్ హరీష్ రావు లేదా మంత్రి కేటీఆర్‌కు భాద్యతలు అప్పజెప్పేవారు గులాబీ బాస్. అయితే మునుగోడు భాధ్యత మంత్రి జగదీష్ రెడ్డి భుజాలపైనే పెట్టారు. ఆ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక మంత్రికి కత్తి మీద సాములా మారిందా?  ఓవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసి దూసుకుపోతుంటే మంత్రి సొంత పార్టీ నేతలను కాపాడుకోలేక పోతున్నారా, అధినేత తనకు అప్పగించిన బాధ్యతలను జగదీష్ రెడ్డి సమర్ధంగా నిర్వహించగలరా.

తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా అక్కడ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు బాధ్యత అప్పగించే వారు కేసీఆర్. బాస్ ఇచ్చిన ఆదేశాలను తుచా తప్పకుండా అమలు చేసే వారాయన. హరీష్ రావు ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలుపు ఖాయం అనే పరిస్థితులు ఉండేవి. కానీ దుబ్బాక, హుజూరాబాద్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈ రెండు చోట్ల టిఆర్ఎస్ ఓటమి పాలయ్యింది. కేటీఆర్, కేసీఆర్ స్వయంగా మానిటరింగ్ చేసిన నాగార్జున సాగర్, హుజూర్ నగర్ లలో మాత్రం టిఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ప్రస్తుతం జరగబోయే మునుగోడు ఉప ఎన్నికల బాధ్యతను ఇప్పుడు మంత్రి జగదీష్ రెడ్డికిఅప్పగించారు గులాబీ బాస్. 2018 లో మునుగోడు నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మునుగోడులో ఇప్పుడు బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెంచింది. ఓవైపు రాజగోపాల్ రెడ్డి మరోవైపు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు కాషాయ కండువాలు కప్పుతూ దూసుకు వెళ్తున్నారు. మరోవైపు మునుగోడు నియోజక వర్గ గులాబీ దళంలో అసంతృప్తి ముదిరి పాకాన పడిందంట. ఇప్పుడు ఇదే మంత్రి జగదీష్ రెడ్డికి ఇబ్బందికరంగా మారిందంట.

మునుగోడు నియోజక వర్గంలో చౌటుప్పల్ ఎంపిపి తాడూరి వెంకట్ రెడ్డితో పాటు పలువురు టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఇప్పటికే కాషాయ గూటికి చేరారు. వారిని పార్టీని వీడకుండా మంత్రి జగదీష్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు మాత్రం బిజెపిలో చేరిపోయారు. ఈ బైపోల్స్‌లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్ఎస్ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిని బుజ్జగించే పనులు మంత్రి చేస్తున్నా, వారు మాత్రం ఆయన మాట వినటం లేదట. ఇది ఉప ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తోందొనన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రిగా మునుగోడు సీటును గెలిపించడం మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ గా మారింది. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ లో సునాయాసంగా టిఆర్ఎస్ విజయం సాధించినా మునుగోడులో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్న టాక్ నడుస్తోంది. ఇక్కడ సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రంగంలోకి దిగారు. నల్గొండ జిల్లాలో బోణీ కొట్టాలని బిజెపి ప్రయత్నిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలను ఎదుర్కొని గెలుపును సొంతం చేసుకోవటం ఆ జిల్లా మంత్రిగా జగదీష్ రెడ్డికి సవాలేనన్న చర్చ జరుగుతోంది. మరి మంత్రి ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.

 

ఇవి కూడా చదవండి: