Home / Munugode Politics
ఎమ్మెల్యేల ప్రలోభాల ఆడియో ప్రైమ్-9 చేతికి చిక్కింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, రామచంద్రభారతి, నందు మధ్య ఫోన్ సంభాషణ బయటపడింది. నందు నాకు వివరాలన్నీ చెప్పాడంటూ రామచంద్రభారతితో చెప్పాడు రోహిత్‌రెడ్డి. నందుకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు రామచంద్రభారతి. డీల్ చేస్తానంటూ నమ్మబలికారు రామచంద్రభారతి. గ్రహణం తర్వాత కలుద్దామని రోహిత్‌రెడ్డికి చెప్పాడు రామచంద్రభారతి. ఇక మునుగోడు ఉప ఎన్నిక లోపే డీల్ పూర్తి కావాలన్న రామచంద్రభారతి చెప్పినట్లు ఆడియోలో స్పష్టమవుతోంది.
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కోవర్ట్ ఆపరేషన్ పనికిమాలిన చర్యగా ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసారి అనసూయ (సీతక్క) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ప్రజలను పలకరిస్తున్న సీతక్క వెంకటరెడ్డి చర్యలను బహిరంగంగానే దుయ్యబట్టారు.
నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలకు సర్వం సిద్దం చేసిన్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ రోహిత్ సింగ్ మీడియాతో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల మేర నాకా బంద్ (చెక్ పోస్టు)లో ఇప్పటివరకు రూ. 1,48,44,160 స్వాధీనం చేసుకొన్నామన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు దండుపాళ్యం ముఠాలెక్క ఇక్కడే పాగా వేసిండ్రు అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
మునుగోడు ఉపఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. గతంలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, దాసోజ్ శ్రవణ్, స్వామిగౌడ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి బాధ కలిగిస్తోందని, మాట్లాడటానికి కూడ ఏమీ లేదని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి అన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది
ప్రతిపక్షాల ఆరోపణలు కొట్టి పారేస్తున్న పోలీసులు. ప్రలోభాలకు గురి చేస్తే కేసులు పెడతామంటూ హెచ్చరిక.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కొన్ని గుర్తులను తొలగించేలా ఎన్నికల కమీషన్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.
ఎవరి మండలంలో వారు భరించాలంటున్న ఏఐసీసీ. వరస అపజయాలతో పార్టీకి ఫండింగ్ కరువు.