Home / Lord Shiva
అన్ని దేవాలయాల్లో చేసే ప్రదక్షిణ వేరు. శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ విధానం వేరు. శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో, అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చో పురాణాల్లో స్పష్టంగా ఉన్నాయి.
శివపూజలో ప్రధానమైన అంశం అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు.హాలాహలాన్ని కంఠమందు ధరించాడు.ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు.
శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా భావిస్తారు. పరమశివుడిని కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం. భోళా శంకరుడు ప్రసన్నుడై, భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి.