Last Updated:

Lord Shiva: సోమవారం శివుడిని ఈ విధంగా పూజించండి..

శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా భావిస్తారు. పరమశివుడిని కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం. భోళా శంకరుడు ప్రసన్నుడై, భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి.

Lord Shiva: సోమవారం శివుడిని ఈ విధంగా పూజించండి..

Spiritual: శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా భావిస్తారు. పరమశివుడిని కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం. భోళా శంకరుడు ప్రసన్నుడై, భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి.

సోమవారం శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే దాని నుంచి బయటపడటానికి మీరు శివుడికి తప్పనిసరిగా ఆవు పాలు సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది.

సోమవారం ఉదయమే ఓం నమః శివాయ అనే పంచాక్షరి జపించడం చాలా పవిత్రంగా భావిస్తారు. మీరు కుటుంబ పరంగా కష్టాలు పడుతుంటే సోమవారం శివలింగంపై నీటితో అభిషేకం చేయండి. శివలింగానికి వివిధ రకాల వస్తువులతో అభిషేకం చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు అందుకుంటారు. అంతేకాకుండా శివుడి అనుగ్రహం పొంది సానుకూల ఫలితాలు పొందుతారు.
మీరు శని సంబంధిత దోషంతో బాధపడుతున్నా, కాలసర్ప దోషం ఉన్నా బయటపడటానికి మీరు ప్రత్యేకంగా శివ ధ్యానం చేయాలి. వెంటనే శని దోషం తొలగిపోయి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం

శత్రువుల నుంచి ప్రమాదంలో ఉంటే భయాన్ని అధిగమించడానికి మీరు ప్రత్యేకంగా సోమవారం పంచాక్షరి జపించాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో జపించాలి. మీకు ఎటువంటి ఆపదలు ఉన్నా తొలగిపోతాయి. శివలింగానికి తేనెతో అభిషేకం చేస్తే క్షయ వ్యాధి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. పాలలో పంచదార కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే, మీ మనసులో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రావణమాసం సోమవారం రోజున బిల్వ పత్రాలతో శివునికి నీటితో సమర్పించాలి. అనంతరం ఆ ఆకులను జేబులో వేసుకోవాలి. ఆ తర్వాత సాయంత్రం ఏదైనా చెట్టు వద్ద ఆకులను ఉంచాలి లేదా ఏదైనా కుండలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ పోతుంది. ఈ మాసంలోని అన్ని శనివారాలలో నూనె, నల్ల నువ్వులను దానం చేయాలి.

అంతేకాకుండా గొడుగులు, బూట్లు, చెప్పులను దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. శ్రావణమాసంలోని గురువారం నాడు పసుపు, శనగలు దానం చేస్తే గురు అనుగ్రహం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి: