Last Updated:

Shiva Pradakshina: శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలంటే..

అన్ని దేవాలయాల్లో చేసే ప్రదక్షిణ వేరు. శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ విధానం వేరు. శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో, అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చో పురాణాల్లో స్పష్టంగా ఉన్నాయి.

Shiva Pradakshina: శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలంటే..

Spiritual: అన్ని దేవాలయాల్లో చేసే ప్రదక్షిణ వేరు. శివాలయంలో చేయాల్సిన ప్రదక్షిణ విధానం వేరు. శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో, అలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చో పురాణాల్లో స్పష్టంగా ఉన్నాయి. శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నుండి మనకి ఎడమపక్కగా బయలుదేరి గర్భాలయానికి వెనుకనున్న సోమసూత్రం (శివుని అభిషేకజలం బయటకు పోయే మార్గం) వరకు వెళ్లి వెనుతిరగాలి. కాని సోమసూత్రం దాటకూడదు.

అక్కడి నుండి వెనుకకు తిరిగి అ ప్రదక్షిణంగా మరల ధ్వజస్తంభాన్ని చుట్టుకుని సోమసూత్రం వరకూ రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తి చేసినట్లు. ఈ విధమైన ప్రదక్షిణలు శివుడికి భక్తులు తమ శక్త్యానుసారం బేసి సంఖ్యలో 3, 5, 7, 9 వచ్చే విధంగా చేయవచ్చు. శివప్రదక్షిణంలో సోమసూత్రాన్ని దాటరాదన్నది ప్రధాన నియమం. అలాచేస్తే ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక ప్రదక్షిణ కిందకే వస్తుంది.
ప్రదక్షిణం చేసేటప్పుడు..

యానికాని చ పాపాని జన్మాంతరకృతానిచ|
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావనే రక్ష రక్ష మహేశ్వర అనే శ్లోకాన్ని పఠించాలి.

ఇవి కూడా చదవండి: