Last Updated:

Abhishekam: శివుడు అభిషేక ప్రియుడు. మరి వేటితో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుందో తెలుసా?

శివపూజలో ప్రధానమైన అంశం అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు.హాలాహలాన్ని కంఠమందు ధరించాడు.ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు.

Abhishekam: శివుడు అభిషేక ప్రియుడు. మరి వేటితో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుందో తెలుసా?

Spiritual: శివపూజలో ప్రధానమైన అంశం అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు.హాలాహలాన్ని కంఠమందు ధరించాడు.ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు. భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి.

పసుపు పొడితో శివునికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజనపొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది. గ్రహదోషాలు తొలగిపోతాయి. బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నేతిలో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయిపండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యాలు మాయమవుతాయి. చెరకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రుభయం వుండదు. యమభయం వుండదు. కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవం, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయపొడితో శివాభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయం అవుతాయి. పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తిప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.

అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలుండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరునికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన గాత్రం సొంతం అవుతుందని పెద్దలు తెలిపారు. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివపూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రతి ప్రదోషానికి బిల్వపత్రాలను శివాలయానికి చేరవేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తారు. ఏదైన శాంతులకు సంబంధించిన పూజలు చేసినప్పుడు పూజ చేసిన తర్వాత స్నానం చేసి, తిరిగి స్వామి వారిని దర్శించుకొవాలి. దీంతో స్నానం తర్వాత, ఉన్న దోషం పూర్తిగా పోతుంది. ఇలాంటి నియమాలు పాటించడంతో ఆ పరమ శివుని అనుగ్రహం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి: