Home / Latest Telamgana News
నిర్మల్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించారు. కొత్త కలెక్టరేట్ భవనంతో పాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రతిపక్షాలపై విమర్శలు కురిపిస్తూనే.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కేసీఆర్ వివరించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. చేతగాని బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం పార్టీ చేతిలో ఉందని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ని గెలిపించాలని ఎంఐఎం పార్టీ చూస్తోందని, ఆ పార్టీకి దమ్ముంటే తెలంగాణలోని మొత్తం స్థానాల్లో పోటీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాం లీలా మైదానంలో జన జాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో సోయం బాపూరావు పాల్గొన్నారు. 12మంది పాస్టర్లు ఇప్పటి వరకూ 1200మందిని మతమార్పిడి చేశారని బాపూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి గుర్తుగా ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం కొంగర కలాన్‌లో జరిగింది.రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు.
: రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం పలుకుతుందని అన్నారు. ప్రియాంక గాంధీ తన పొలిటికల్ టూర్‌ను ఎడ్యుకేషన్ టూర్‌గా మార్చుకున్నారని, హైదరాబాద్ అభివృద్ధి చూసి ప్రియాంక పాఠాలు నేర్చుకోవాలన్నారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న ఆమె.. హైదరాబాద్ మహానగరంలో తొలి రాజకీయ సభకు హాజరవుతున్నారు
థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్ అయ్యాడు. పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ చికోటి ప్రవీణ్ పట్టుబడ్డాడు. థాయ్‌లాండ్ పోలీసుల అదుపులో చికోటి, మాధవ్‌రెడ్డి, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి ఉన్నారు.