Home / Latest Telamgana News
తెలంగాణలో పంట రుణాల మాఫీని మూడు విడతల్లో ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు. బుధవారం ప్రజాభవన్‌లో జరిగిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి పారిశుధ్య పరిస్దితులను తనిఖీ చేసారు.
తెలంగాణ దీర్ఘకాలిక కరువు సమస్యకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంతిమ పరిష్కారమని నిరూపించబడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ ప్రచారం మరియు విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, ఇలాంటి రాజకీయ కుతంత్రాలను, విమర్శలను బీఆర్ఎస్ తట్టుకోగలదని ఆయన అన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులోని పరిశ్రమలో పేలుడు సంభవించింది. సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంప్రెషన్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్ కారు యాక్సిడెంట్ కేసులో హైకోర్టు బెయిల్ మంజురుకు నిరాకరించింది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్డు ప్రమాదంలో షకీల్ కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నించారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' వేదికగా మరోసారి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్రం పదేళ్లు తాత్సారం చేసి వందలాది మంది ఆత్మబలిదానానికి కారణం ఎవరు?
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. నటి హేమకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నటి హేమ, అషీరాయ్, వాసుకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
మ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 24కు వాయిదా పడింది .ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే .దీనిపై శుక్రవారం విచారణ జరగాల్సి వుంది . అయితే వాదనలకు మరింత సమయం కావాలని ఈడీ కోరడంతో తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు .
ఈ నెల ఎనిమిదో తేదీ లోపు రైతు భరోసా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తొమ్మిదో తేదికేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలని.. బకాయి ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భూదాన్ పోచంపల్లిని సందర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఆమె ముందుగా పట్టణంలోని ఆచార్య వినోబా భావే భవన్‌కు వెళ్లారు. అక్కడ వినోబా భావే, వెదిరె రామచంద్రారెడ్డి చిత్రపటాలకు ఆమె నివాళులర్పించారు.