Home / Latest Telamgana News
అధికారంలో ఉన్నన్నాళ్లు బిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయాలని ప్రశ్నించని ఆ పార్టీ నేతలు నెమ్మదిగా గళం విప్పడం ప్రారంభించారు. అధినేత నిర్ణయాలని తప్పుబట్టడం మొదలు పెట్టారు. కొన్ని జిల్లాల్లో తమ ఎమ్మేల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అంగీకరించారు.
తెలంగాణలో అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో ఆలోచించి ఓటు వేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్, చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. పీవోపీ విగ్రహాలు కుంటల్లో నిమజ్జనం చేయాలని తెలిపింది. హైకోర్టు హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది హై కోర్టు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న (ఆదివారం) తెలంగాణ పర్యటనకు రానున్నారు. అదే రోజు సాయంత్రం ఖమ్మం లో జరిగే బీజేపీ రైతు సభ లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
హైదరాబాద్ లో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దిల్ రాజ్, సి.కళ్యాణ్ ప్యానెల్ మధ్య పోటీ జరగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. ఫిలిం ఛాంబర్ లో మొత్తం 1600 మంది సభ్యులు ఉండగా… 900 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసిన భారీ వానలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 20 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ
అమెరికా ఎన్నారైలు ఏర్పాటు చేసిన తానా సభలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌కి చేరుకున్న సమాజ్‌వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో అఖిలేష్ యాదవ్‌కి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు.
తెలంగాణ ఉద్యమాన్ని తన ఆత్మబలిదానంతో కీలక మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మని ఎట్టకేలకు బిఆర్ఎస్ అధిష్టానం కరుణించినట్లే కనిపిస్తోంది. ఇంతకాలం శంకరమ్మని పట్టించుకోకుండా పక్కనబెట్టిన బిఆర్ఎస్ అధిష్టానం తాజాగా ఆమెని రేపు హైదరాబాద్‌కి రావాలని పిలిచింది.
హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. 1956లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారని విద్యాసాగర్ రావు తెలిపారు. హైదరాబాద్ దేశానికి తలమానికమన్నారు.