KTR Tweet: తెలంగాణ నీటి కష్టాలకు సమగ్ర పరిష్కారం కాళేశ్వరం .. కేటీఆర్
తెలంగాణ దీర్ఘకాలిక కరువు సమస్యకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంతిమ పరిష్కారమని నిరూపించబడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ ప్రచారం మరియు విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, ఇలాంటి రాజకీయ కుతంత్రాలను, విమర్శలను బీఆర్‌ఎస్ తట్టుకోగలదని ఆయన అన్నారు.
KTR Tweet:తెలంగాణ దీర్ఘకాలిక కరువు సమస్యకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంతిమ పరిష్కారమని నిరూపించబడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ ప్రచారం మరియు విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, ఇలాంటి రాజకీయ కుతంత్రాలను, విమర్శలను బీఆర్‌ఎస్ తట్టుకోగలదని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం xలో ట్వీట్ చేసారు.
అసూయపడే ప్రాజెక్టు..(KTR Tweet)
కాళేశ్వరం తెలంగాణలో నీటి ఎద్దడితో ఏర్పడిన బాధలను దూరం చేసిన పరివర్తన ప్రాజెక్టని కేటీఆర్ తెలిపారుకొత్త తెలంగాణ రాష్ట్ర పతనాన్ని చూడాలనుకునే వారు అసూయపడే ఈ ప్రాజెక్టు తెలంగాణకు గర్వకారణమని ఆయన అన్నారు. గోదావరి నదీజలాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ నష్టపోతున్న తెలంగాణలోని ఎండిన భూములకు సాగునీరు అందించడమే మా పరిష్కారమని ఆయన అన్నారు.గోదావరి నదిపై నీటి హక్కుల కోసం దశాబ్దాల తరబడి సాగిన పోరాటాన్ని పరిష్కరించిన ఘనత ఈ ప్రాజెక్టుదని కేటీఆర్ అభివర్ణించారు. మన ఎత్తైన పొలాలకు ఇప్పుడు నదీ జలాలు అందుబాటులో ఉన్నాయి, ఇది చాలా ఉపశమనాన్ని అందిస్తుంది. గోదావరి జలాల దోపిడీకి కాళేశ్వరమే సమాధానమని అన్నారు. దశాబ్దాలుగా నోచుకోని శ్రీరాంసాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల పునరుద్ధరణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరంలా మారిందని అన్నారు. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు నిండు కుండలా నీటితో కళకళలాడుతున్నాయన్నారు. కాళేశ్వరం మన తపన, ఆలోచన, అన్వేషణ మరియు దౌత్యానికి నిదర్శనం. ఇది కేవలం ఒక బ్యారేజీ కంటే ఎక్కువ; తెలంగాణ నీటి కష్టాలకు ఇది సమగ్ర పరిష్కారమని అన్నారు.ఇంత పెద్ద ప్రాజెక్టుల్లో చిన్నపాటి లోపాలు సహజమేనని, వాటిని సరిదిద్దుకోవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. చివరగా మీ ఏడుపే మా ఎదుగుదల అంటూ ముగించారు.