Home / latest national news
ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా అందుతున్న సమాచారం మేరకు 233 కు చేరింది. ఈ ఘోర ప్రమాదంలో 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. అనుకోని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అయితే, న్యాయ ప్రక్రియను అనుసరించి మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని కేంద్రం కోరుకుంటోంది.
మణిపూర్‌లో దోచుకున్న ఆయుధాలను తిరిగి ఇవ్వమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలను హెచ్చరించిన తరువాత, శుక్రవారం 140కి పైగా ఆయుధాలు పోలీసులకు అప్పగించారు. ఆయుధాల కోసం త్వరలో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభిస్తామని, ఎవరైనా అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హెచ్చరించారు.
: కులం, మతం అనే తారతమ్యం లేకుండా ఐదు ఎన్నికల హామీలను అమలు చేయాలని కర్ణాటక మంత్రివర్గం శుక్రవారం సమావేశమై నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పథకాలను అమలు చేసేందుకు కాలపరిమితి నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో ఖాప్ 'మహాపంచాయత్' ముగిసింది. రైతు సంఘాల నాయకుడు రాకేష్ తికాయత్ కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ మరియు భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని కోరారు.
ప్రధాన స్నానాల పండుగ తేదీలను ప్రకటించే హోర్డింగ్‌తో 2025లో జరిగే మహా కుంభమేళాకు అధికారికంగా కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయం వెలుపల హోటల్ రాహి ఇలావర్ట్ ప్రాంగణానికి సమీపంలో 45 రోజుల పాటు జరిగే ఈ మెగా మతపరమైన ఉత్సవాల గురించి తెలియజేస్తూ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు.
:తనపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 5న అయోధ్యలో జరగాల్సిన తన ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రకటించారు. ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించడంతో ఈ ప్రకటన వెలువడింది.
ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో, సముద్రంలో పడేసిన రూ.20.2 కోట్ల విలువైన 32 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సముద్ర మార్గంలో రామేశ్వరం మండపం ప్రాంతం గుండా బోటులో పెద్ద మొత్తంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వాషింగ్టన్‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఇంటరాక్షన్‌లో భారత్ లోని ప్రతిపక్షాల ఐక్యత, బలం గురించి విశ్వాసం వ్యక్తం చేసారు.