Last Updated:

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం: బాధితుల కోసం క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సడలించిన ఎల్‌ఐసి

:ఒడిశా రైలు ప్రమాద బాధితుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) తన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సడలించినట్లు కార్పొరేషన్ చైర్‌పర్సన్ సిద్ధార్థ మొహంతి శనివారం తెలిపారు. క్లెయిమ్‌దారుల ట్రయల్స్ మరియు కష్టాలను తగ్గించడానికి ఎల్‌ఐసి రాయితీలను ప్రకటించింది.

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం: బాధితుల కోసం క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను  సడలించిన ఎల్‌ఐసి

Odisha train accident:ఒడిశా రైలు ప్రమాద బాధితుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) తన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను సడలించినట్లు కార్పొరేషన్ చైర్‌పర్సన్ సిద్ధార్థ మొహంతి శనివారం తెలిపారు. క్లెయిమ్‌దారుల ట్రయల్స్ మరియు కష్టాలను తగ్గించడానికి ఎల్‌ఐసి రాయితీలను ప్రకటించింది. దాదాపు 300 మంది మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఎల్‌ఐసి పాలసీలు మరియు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన యొక్క క్లెయిమ్‌దారులకు మొహంతి అనేక రాయితీలను ప్రకటించారు.

డెత్ సర్టిఫికెట్లకు బదులుగా మరణాల జాబితా..(Odisha train accident)

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రమాదం వలన ప్రభావితమైన వారికి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. ఆర్థిక ఉపశమనం అందించడానికి క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లను వేగవంతం చేస్తుందిఅని మొహంతి చెప్పారు. ఎల్‌ఐసీ పాలసీల క్లెయిమ్‌దారుల కష్టాలను తగ్గించడమే కాకుండా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సభ్యుల కష్టాలను తగ్గించడమే దీని లక్ష్యం అని ఆయన తెలిపారు.
రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికెట్లకు బదులుగా, రైల్వే అధికారులు, పోలీసులు లేదా ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రచురించిన మరణాల జాబితా మరణానికి రుజువుగా అంగీకరించబడాయని అన్నారు.

ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు ..

క్లెయిమ్-సంబంధిత ప్రశ్నలకు ప్రతిస్పందించడానికి మరియు హక్కుదారులకు సహాయం అందించడానికి డివిజనల్ మరియు బ్రాంచ్ స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయబడ్డాయని అని మొహంతి ఒక ప్రకటనలో తెలిపారు.బాధిత కుటుంబాలకు క్లెయిమ్‌లు త్వరితగతిన పరిష్కారమయ్యేలా మరియు క్లెయిమ్‌దారులకు చేరువయ్యేలా అన్ని ప్రయత్నాలూ తీసుకోబడతాయి. తదుపరి సహాయం కోసం, క్లెయిమ్‌దారులు తమ సమీప శాఖ, డివిజన్ లేదా కస్టమర్ జోన్‌లను సంప్రదించవచ్చని ఎల్‌ఐసి తెలిపింది. క్లెయిందారులు కాల్ సెంటర్ – 02268276827కి కూడా కాల్ చేయవచ్చని ఎల్ఐసి పేర్కొంది.