Home / latest national news
మణిపూర్‌లో అల్లర్లు, హింసాత్మక సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. గురువారం ఇంఫాల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు.
TATA Consultancy Service: భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు ఐటీ సేవల వైపు పరుగులు పెడుతున్నారు. సెల్ ఫోన్ మొదలుకుని ఇంట్లోని గ్యాడ్జెట్స్ వరకు నిత్యం మనం ఐటీ రంగం ద్వారా ఏదో ఒక రూపంలో సేవలు పొందుతూనే ఉన్నాం. కాగా ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత విలువైన భారత బ్రాండ్ ఏంటీ అంటూ ఓ సంస్థ సర్వే చేసింది.
సహకార రంగంలో ఆహారధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని 700 లక్షల టన్నులకు పెంచేందుకు రూ.1 లక్ష కోట్ల కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.ప్రస్తుతం దేశంలో ధాన్యం నిల్వ సామర్థ్యం 1,450 లక్షల టన్నులు ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వివరాలను తెలియజేస్తూ చెప్పారు.
జ్ఞాన్వాపి-శృంగర్ గౌరీ కేసులో హిందూఆరాధకుల పిటిషన్ ను సవాలు చేస్తూ ముస్లిం పక్షం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అంజుమన్ ఇంతేజామియా కమిటీ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది.
ప్రఖ్యాత ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ ‘సారే జహాన్ సే అచ్ఛా’ను రచించడం ద్వారా దేశానికి సేవ చేశాడని, అయితే తాను దానిని అసలు నమ్మలేదని ఢిల్లీ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ యోగేష్ సింగ్ అన్నారు.
మణిపూర్‌లో చెలరేగిన హింసపై సీబీఐ విచారణ జరిపిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ITLF) కార్యదర్శి మువాన్ టోంబింగ్ కు హామీ ఇచ్చారు. వచ్చే 15 రోజుల్లో విచారణ చేపడతామని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని అమిత్ షా కోరారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెజ్లర్లు తమ పతకాలను గంగలో నిమజ్జనం చేసేందుకు మంగళవారం హరిద్వార్ చేరుకున్నారు. సమస్య పరిష్కారానికి ఐదు రోజుల సమయం కావాలని రైతు నాయకులు కోరడంతో పథకం విరమించుకున్నారు.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. 2022 జూలైలో పాట్నా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని హతమార్చేందుకు నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పన్నిన కుట్రకు సంబంధించి బుధవారం నాటి ఎన్ఐఏ దాడులు జరిగాయి.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాబోయే మూడు రోజుల పాటు కేదార్నాథ్ ధామ్‌ను సందర్శించడానికి కొత్త పర్యాటకుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. యాత్రకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు నమోదు చేసుకోవడంతో రద్దీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తన ఖరీదైన ఫోన్‌ను తిరిగి పొందేందుకు రిజర్వాయర్ నుండి 42 లక్షల లీటర్ల నీటిని తోడించినందుకు ఛత్తీస్‌గఢ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాదు రిజర్వాయర్ నుంచి ఐదు అడుగుల వరకు నీటిని తోడివేసేందుకు మౌఖిక అనుమతి ఇచ్చారని ఇన్స్పెక్టర్ పేర్కొన్న సీనియర్ అధికారిని బాధ్యులను చేశారు.