Home / latest national news
దేశ రాజధాని న్యూఢిల్లీ సహా పలు నగరాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. ఢిల్లీలో నాణ్యమైన ఉల్లి రిటైల్ ధర కిలో రూ.90కి చేరుకుంది. నిన్నటి వరకు కిలో రూ.80కి లభించేది. కాగా, ఉల్లి కిలో రూ.70కి విక్రయిస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్రల్లో వర్షాలు ఆలస్యమై ఖరీఫ్ పంటలు విత్తడం ఆలస్యమై ఆ తర్వాత మార్కెట్లోకి కొత్త ఉల్లిపాయలు రాకపోవడమే ఉల్లి ధరల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు.
ఆదివారం కేరళలోని ఎర్నాకులం జిల్లాలో క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో జరిగిన పేలుడు IED వల్ల సంభవించిందని రాష్ట్ర పోలీసు షేక్ దర్వేష్ సాహెబ్ తెలిపారు. అయితే జరిగిన పేలుళ్ల సంఖ్యపై విరుద్ధమైన నివేదికలు ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు వీఎన్ వాసవన్, ఆంటోని రాజులు ఇద్దరు చెప్పగా, ప్రత్యక్ష సాక్షులు పలు పేలుళ్లు జరిగాయని చెబుతున్నారు.
కేరళలోని కొచ్చిలోని కలమస్సేరి ప్రాంతంలోని కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన పలు పేలుళ్లలో ఒకరు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించిందని, ఆ తర్వాత గంట వ్యవధిలో పలు పేలుళ్లు జరిగాయని కలమసేరి సీఐ విబిన్ దాస్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. కోట్ల విలువైన రేషన్ కుంభకోణంలో మంత్రి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు.
: అస్సాంలోని ప్రభుత్వ ఉద్యోగులు జీవిత భాగస్వామి జీవించి ఉంటే రెండో పెళ్లి చేసుకోవడానికి అర్హత లేదని, వారు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తన నియోజకవర్గం దాతియా కోసం హేమ మాలిని డ్యాన్స్‌ను ఒక అభివృద్ది కార్యక్రమంగా లెక్కిస్తూ చేసిన ప్రసంగం యొక్క వీడియో వైరల్ కావడంతో వివాదాస్పదమైంది. నరోత్తమ్ మిశ్రా ఎన్నికల ప్రచార సభలో తాను చేసిన అభివృద్ధి పనులను వివరించారు. దాతియాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా 'హేమమాలినితో డ్యాన్స్ కూడా చేయించామని చెప్పారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సమన్లు జారీ చేసింది. దీనిని రాజకీయ కుట్ర మరియు ప్రభుత్వ సంస్థల దుర్వినియోగంగా వైభవ్ గెహ్లాట్ పేర్కొన్నారు.
చెన్నైలోని రాజ్‌భవన్ ప్రధాన గేటుపై పెట్రోల్ బాంబులు విసిరిన వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.పెట్రోల్ బాంబు విసిరిన వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఒక భూవివాదంలో ఒక వ్యక్తి తన సోదరుడిని ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు. ఈ ఘటనలో అతను ట్రాక్టర్‌ను ఎనిమిది సార్లు ముందుకు వెనుకకు నడిపడంతో అతని సోదరుడు అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై రాజస్థాన్ ప్రజలు, ప్రతిపక్షాల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జైలర్ నటుడు వినాయకన్‌ను కేరళలోని ఎర్నాకులం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించి, మద్యం మత్తులో బెదిరింపులు మరియు మాటలతో దూషించినందుకు అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.