RBI Deputy governor: ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎస్‌బీఐ ఎండీ స్వామినాథన్ జానకిరామన్ నియామకం
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ జానకిరామన్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా కేంద్రం మంగళవారంనాడు నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు లేదా తదితర ఉత్వర్వులు వెలువడేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
RBI Deputy governor: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ జానకిరామన్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా కేంద్రం మంగళవారంనాడు నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు లేదా తదితర ఉత్వర్వులు వెలువడేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మహేష్ కుమార్ జైన్ పదవీకాలం మంగళవారం ముగియడంతో కేంద్రం ఈ నియామకాన్ని చేపట్టింది. ఆర్బీఐ గవర్నర్‌కు నెలకు రూ.2.5 లక్షల వేతనం, అలవెన్సులు లభిస్తాయి.
మూడేళ్ల పదవీకాలం.. (RBI Deputy governor)
ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్ ఉండగా, డిప్యూటీ గవర్నర్లుగా మైఖేల్ పాత్ర, ఎం.రాజేశ్వరరావు, టి.రవిశంకర్ ఉన్నారు. డిప్యూటీ గవర్నర్ల పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. రీఎపాయింట్‌మెంట్‌కు కూడా అవకాశం ఉంటుంది. డిప్యూటీ గవర్నర్‌కు నెలకు రూ. 2.25 లక్షల జీతంతోపాటు అలవెన్సులు కూడా లభిస్తాయి.డిప్యూటీ గవర్నర్ యొక్క ఒక పోస్ట్ వాణిజ్య బ్యాంకర్ కోసం రిజర్వ్ చేయబడింది. ఆర్బీఐ చట్టం, 1934 ప్రకారం, సెంట్రల్ బ్యాంక్‌లో నలుగురు డిప్యూటీ గవర్నర్‌లు ఉండాలి.