Home / Latest Internatiional News
బాగ్దాద్‌లోని స్వీడిష్ రాయబార కార్యాలయంపై గురువారం తెల్లవారుజామున వందలాది మంది నిరసనకారులు దాడి చేసి నిప్పంటించారు,. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ను స్వీడన్లో తగులబెట్టడంతో షియా మతగురువు ముక్తాదా సదర్ మద్దతుదారులు ఈ నిరసనకు పిలుపునిచ్చారు,
సింగపూర్ పాస్‌పోర్ట్ 192 దేశాలకు వీసా రహిత ప్రయాణంతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఇది హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. జూలై 18న విడుదల చేసిన కొత్త జాబితా ప్రకారం గతంలో టాప్ ర్యాంక్ హోల్డర్‌గా ఉన్న జపాన్ మూడో ర్యాంక్‌కు దిగజారింది.
: సోమవారం అమెరికాలోని ఫాల్‌బ్రూక్ ప్రాంతంలో ఏడాది బాలికను ఆమె మూడేళ్ల తోబుట్టువు కాల్చి చంపింది. మూడేళ్ల చిన్నారి తన ఏడాది తోబుట్టువును ప్రమాదవశాత్తు కాల్చిచంపినట్లు వచ్చిన రిపోర్టుల నేపథ్యంలో ఉదయం 7.30 గంటలకు శాన్ డియాగో షెరీఫ్కు కాల్ వచ్చిందని లెఫ్టినెంట్ జోసెఫ్ జార్జురా ఒక వార్తా ప్రకటనలో తెలిపారు.
అమెరికన్ టెక్ కంపెనీల గూఢచర్య కార్యకలాపాల గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య, రష్యన్ అధికారులు ఆపిల్ ఉత్పత్తులపై కఠినమైన వైఖరిని తీసుకున్నారు, వేలాది మంది అధికారులు మరియు రాష్ట్ర ఉద్యోగులు ఆపిల్ తయారు చేసిన ఐఫోన్లు మరియు ఇతర పరికరాలను ఉపయోగించడాన్ని నిషేధాన్ని విధించారు.
స్కాట్లాండ్ దీవిలోని సముద్రతీరంలో చిక్కుకున్న 50 పైలట్ తిమింగలాలు చనిపోయాయి. ఆదివారం ఉదయం 7 గంటలకు, సముద్ర రక్షకులు లూయిస్ ద్వీపంలోని నార్త్ టోల్స్టాలోని ట్రైగ్ మోర్ వద్దకు చేరుకున్నారు. వారు డజన్ల కొద్దీ పైలట్ తిమింగలాలు ప్రాణాపాయస్దితితో ఉన్నట్లు గుర్తించారు
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలోని ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను అవుట్సోర్సింగ్కు ఇవ్వాలని యోచిస్తోంది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (IIA)ని విదేశీ ఆపరేటర్లకు అవుట్సోర్స్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.
ఆదివారం ఫారో దీవుల్లో దాదాపు 80 పైలట్ తిమింగలాలను సామూహికంగా చంపిన ఘటనను చూసిన ప్రయాణికులకు బ్రిటిష్ క్రూయిజ్ లైన్ క్షమాపణలు చెప్పింది. అంబాసిడర్ క్రూయిస్ లైన్ ప్రయాణీకులు రాజధాని టోర్షావ్న్ లోని ఓడరేవుకు చేరుకున్నారు. అక్కడ సంప్రదాయ వేటగాళ్ళు మోటర్బోట్లు మరియు హెలికాప్టర్‌ను ఉపయోగించి సమీపంలోని బీచ్‌లో తిమింగలాలను కొక్కాలతో లాగి, వాటిని బంధించి కత్తులతో చంపారు.
నేపాల్‌లోని ఎవరెస్ట్ పర్వతం సమీపంలో హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఐదుగురు మెక్సికన్ పర్యాటకులు కాగా, పైలట్ నేపాలీ అని అధికారులు తెలిపారు. మెక్సికన్లలో ఇద్దరు పురుషులు మరియు ముగ్గురు మహిళలు ఉన్నారు.
గత నెలలో మరణించిన ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ 100 మిలియన్ యూరోలను (రూ. 9,05,86,54,868) తన 33 ఏళ్ల స్నేహితురాలు మార్టా ఫాసినాకు తన వీలునామాలో రాసినట్లు గార్డియన్ నివేదించింది. మూడు సార్లు ఇటాలియన్ ప్రధాన మంత్రి సామ్రాజ్యం విలువ 6 బిలియన్ యూరోల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.
వినియోగదారుల రక్షణ మరియు కార్పొరేట్ పాలనకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు చైనా అధికారులు బిలియనీర్ జాక్ మా స్థాపించిన ఫిన్‌టెక్ దిగ్గజం యాంట్ గ్రూప్‌కు 1 బిలియన్ డాలర్ల జరిమానా విధించారు.