Last Updated:

Mega DSC in AP: మెగా డీఎస్సీ ఫైలుపై చంద్రబాబు తొలి సంతకం.. కళకళలాడనున్న కోచింగ్ సెంటర్లు

  కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వానికి తాము ఇచ్చిన ముఖ్యమైన హామీలపై ముఖ్య మంత్రి తొలి సంతకం చేయడం అనేది వైఎస్ తో ప్రారంభమైందని చెప్పొచ్చు . 2004 లో వైఎస్ ఉచిత విద్యుత్ ఫైల్ పై తొలి సంతకం చేసారు .

Mega DSC in AP: మెగా డీఎస్సీ ఫైలుపై చంద్రబాబు తొలి సంతకం.. కళకళలాడనున్న కోచింగ్ సెంటర్లు

 Mega DSC in AP:  కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వానికి తాము ఇచ్చిన ముఖ్యమైన హామీలపై ముఖ్య మంత్రి తొలి సంతకం చేయడం అనేది వైఎస్ తో ప్రారంభమైందని చెప్పొచ్చు . 2004 లో వైఎస్ ఉచిత విద్యుత్ ఫైల్ పై తొలి సంతకం చేసారు . తాజాగా ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కూడా తాను తొలి సంతకం మెగా డి ఎస్ సి ప్రకటన ఫైల్ పై పెట్టనున్నారు . తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే పెడతానని ఎన్నికల ముందే ప్రకటించారు .దింతో ఇప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగ ఆశావహులు కోచింగ్ సెంటర్లకు పరుగెడుతున్నారు .ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి చాలా కాలం అయింది.ఇప్పుడు మళ్ళీ కోచింగ్ సెంటర్లకు కళ వచ్చింది

ప్రతిరాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొంటాయి .ఏపీలో తాజాగా ఎన్నికల్లో గెలిచిన కూటమి కూడా తమ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ప్రకటిస్తామని పేర్కొంది .దీనికి అనుగుణంగానే ముఖ్య మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం డిఎస్సి పై నే పెడతానని చంద్రబాబు ప్రకటించారు .ఇప్పుడు అది నెరవేరబోతోంది .దింతో ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల ఆశావహులు ఎంతో ఆనంద పడుతున్నారు .ఎన్నికల ముందు జగన్ తక్కువ ఖాళీలతో డిఎస్సి ప్రకటన జారీ చేసారు .కానీ ఆశావహులు ఎక్కువగా ఉండడం తో దీని పై అప్పట్లో విమర్శలు వచ్చాయి .అప్పుడే చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఎక్కువ పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటిస్తామని మాట ఇచ్చారు .ఇప్పుడు దానికనుగుణంగానే మెగా డిఎస్సి ప్రకటన పై చంద్రబాబు తొలి సంతకం చేసారు.

అవనిగడ్డ బాట..( Mega DSC in AP)

ఏపీపీఎస్సీ నుంచి కూడా ఉద్యోగ ప్రకటనలు వచ్చి చాలా కాలం అయింది .దింతో నిరుద్యోగ యువత ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూస్తోంది .దింతో ఇప్పుడు నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు .తెలుగు రాష్ట్రాలలో డిఎస్సి కోచింగ్ అంటే అందరికి గుర్తుకు వచ్చేది కృష్ణా జిల్లా అవనిగడ్డ .ఇప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగ ఆశావహులు అవనిగడ్ద బాట పట్టనున్నారని తెలుస్తోంది .పనిలో పనిగా కోచింగ్ సెంటర్లు కూడా పుట్టగొడుగుల మాదిరి పుట్టుకొచ్చే అవకాశం వుంది .ఎక్కువ మొత్తంలో పోస్ట్ లు భర్తీ కానుండడంతో ఆశావహులు సైతం ఎక్కువగా వున్నారు .దింతో కోచింగ్ ఫీజు కూడా భారీగానే వసూలు చేసే అవకాశం వుంది .మంచి సత్తా వున్న ఫ్యాకల్టీ వున్న కోచింగ్ సెంటర్ను ఎంచుకోవాల్సి న అవసరం వుంది .సందట్లో సడేమియా అన్నట్లు చెట్లు కింద కూర్చో బెట్టి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ లు కూడా ఉంటాయి .ఈ విషయంలో నిరుద్యోగులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది .

కోచింగ్ సెంటర్లదే హవా..

ఇప్పటి వరుకు ఖాళీగా ఉన్న కోచింగ్ సెంటర్లు తమ బోర్డుల దుమ్ము దులిపి స్వాగతం పలకనున్నాయి .వీధులన్నీ ఫ్లెక్సీలతో నిండిపోనున్నాయి . వేలాదిమంది నిరుద్యోగ యువతీ, యువకులు ఇప్పుడు తప్పితే మరో అవకాశం తమకు ఉండకపోవచ్చని భావించి ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని తీవ్రంగా ప్రయ్నతిస్తున్నారు. అందులో భాగంగానే డిఎస్సి సాధించేందుకు కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. కోచింగ్‌ సెంటర్లవారు ఇదే అదనుగా భావించి పెద్ద మొత్తంలో ఫీజులు పెంచేస్తున్నారు . గ్రామీణ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువతీ, యువకులు జిల్లా కేంద్రానికి వచ్చి ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో, ప్రైవేట్‌ హాస్టళ్లలో చేరుతున్నారు.. నిరుద్యోగుల ఆశలను అవకాశంగా మార్చుకున్న కోచింగ్‌ సెంటర్ల యజమానులు విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: