Last Updated:

Chandrababu Naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్‌లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీపైన తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు.. ఇచ్చిన మాట మేరకు అదే ఫైల్‌ పైన తొలి సంతకం చేశారు.

Chandrababu Naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు

 Chandrababu Naidu:  ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్‌లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీపైన తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు.. ఇచ్చిన మాట మేరకు అదే ఫైల్‌ పైన తొలి సంతకం చేశారు.

ఐదు ఫైల్స్ పై సంతకాలు..( Chandrababu Naidu)

16వేల, 347 పోస్టులతో ఉపాధ్యాయ నియామకం కోసం షెడ్యూల్‌ విడుదల చేశారు. వీటిలో ఎస్జీటీ 6,371, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ 62 పోస్టులు ఉన్నాయి. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం 6వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత పలు కారణాలతో తేదీలలో మార్పులు చేశారు. అయితే ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో డీఎస్సీ వాయిదా పడింది.దీంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిరుత్సాహానికి గురయ్యారు. ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేశారు. 4 వేలకు పింఛన్ పెంపుపై మూడో సంతకం.. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్ జీవోపై ఐదో సంతకం చేశారు.

తాము అధికారంలోకి వస్తే.. మెగా డీఎస్సీ ప్రకటిస్తామంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మాటిచ్చారు. అలాగే టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఇదే హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపొందటంతో నిరుద్యోగులు మెగా డీఎస్సీపై ఆశగా ఎదురుచూశారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ డీఎస్సీ ఫైలుపై సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేశారు.

ఇవి కూడా చదవండి: