Home / latest ap news
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీవి కావని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు.
ఈడీ నోటీసుల నేపథ్యంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి శనివారం ఉదయం 10 గంటలకే విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. సాయంత్రం వరకూ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గల వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ థర్మల్ పవర్‌స్టేషన్‌లో లిఫ్ట్ వైరు తెగి కిందకు పడిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్ లో 8 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యాయి. లిఫ్ట్ లో చిక్కుకున్న వారిని అతి కష్టం మీద బయటికి తీసి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెయిన్ అలెర్ట్ వచ్చేసింది. ఉపరితల ఆవర్తనం బంగ్లాదేశ్, పొరుగు ప్రాంతాల నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా మీద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవరించి ఉన్నట్లు సమాచారం అందుతుంది. అదే విధంగా ఉత్తర అంతర్గత తమిళనాడు నుంచి కొంకణ్ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు తీరప్రాంతం, అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తు వరకు విస్తరించి వుంది.
‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రం చేతిలో ఉంది. ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి కేంద్ర ఎంత ఒత్తిడి చేసినా, ఇతర రాష్ట్రాల అభ్యంతరాల్లో, భూ సేకణ, పునరావాస, పునర్ నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధుల కావాలనే కారణాలు చూపించినా అంగీకరించొద్దు.
జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. పలుచోట్ల తేలికపాటిగాను, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు తాజాగా ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్ర గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అబ్దుల్ నజీర్ ఇటీవలనే రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా రిటైరైన వెంటనే ఏపీ గవర్నర్ గా నజీర్ ను నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.
ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ఆందోళన గురించి తెలుసని వెల్లడించింది. ఉద్యోగ సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని కేంద్రం తెలిపింది.
Pawan Kalyan: ఈనెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ అరాచక పాలనపై యుద్ధం ప్రకటించేందుకు జనసేన( JanaSena) అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ‘నేను సిద్ధం.. జన సైనికులారా మీరు సిద్ధమా!’ అని పవన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఈ క్రమంంలో శనివారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మంగళగిరి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయన అక్కడి నుంచి […]