Home / latest ap news
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాననడం బాధాకరమని వల్లభనేని వంశీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో సీఐడీ అధికారులు రెండో రోజు సోదాలు కొనసాగిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంత భూవివాదానికి సంబంధించిన కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు.. హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లిలోని నారాయణ కుమార్తె నివాసాలపై శుక్రవవారం సోదాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ వైద్యరంగ చరిత్రలో మణిపాల్ హాస్పటిల్ విజయవాడ మరో అరుదైన ఘనత సాధించింది. కేవలం ఒక్క ఏడాది లోనే అత్యంత క్లిష్టతరమైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క సంవత్సరంలో సుమారు 70కి పైగా ఇలాంటి అరుదైన సర్జరీలను నిర్వహించిన ఏకైక హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ కావడం గమనార్హం.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి.. ఇపుడు స్ధానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ దాడి ఘటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గన్నవరంలో 144 సెక్షన్ విధించినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అనుచరులు వీరంగం సృష్టించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు.
ఆంద్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో రెండు తెలుగు రాష్ట్రాలు మార్మోగుతున్నారు. దూపదీప నైవేధ్యాలు, భజనలతో శివాలయాలు కళకళలాడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పలు రాష్ట్రాల్లోనూ మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉండే కోటప్పకొండ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కోటప్పకొండ సమీపంలోని గ్రామాలకు చెందిన వారు.. ప్రభలు కట్టుకుని కొండకు వెళ్లి శివయ్యను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.