Last Updated:

Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెయిన్ అలెర్ట్ వచ్చేసింది. ఉపరితల ఆవర్తనం బంగ్లాదేశ్, పొరుగు ప్రాంతాల నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు  పశ్చిమ బెంగాల్, ఒడిశా మీద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవరించి ఉన్నట్లు సమాచారం అందుతుంది. అదే విధంగా ఉత్తర అంతర్గత తమిళనాడు నుంచి కొంకణ్ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు తీరప్రాంతం, అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తు వరకు విస్తరించి వుంది.

Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

Rain Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెయిన్ అలెర్ట్ వచ్చేసింది. ఉపరితల ఆవర్తనం బంగ్లాదేశ్, పొరుగు ప్రాంతాల నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు  పశ్చిమ బెంగాల్, ఒడిశా మీద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవరించి ఉన్నట్లు సమాచారం అందుతుంది. అదే విధంగా ఉత్తర అంతర్గత తమిళనాడు నుంచి కొంకణ్ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు తీరప్రాంతం, అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తు వరకు విస్తరించి వుంది. కాగా ఈ తరుణంలోనే రాబోవు మూడు రోజులకు వాతావరణ శాఖ పలు సూచనలు చేస్తుంది.

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు, శుక్రవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉందని..  గంటకు 40-50 కి మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం నాడు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉందని.. గంటకు 30 -40 కి మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు.

వాతావరణ శాఖ సూచనల ప్రకారం (Rain Alert)..

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో .. 

గురువారం –  తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో)వీచే అవకాశం ఉంది.

శుక్రవారం –  తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో)వీచే అవకాశం ఉంది.

శనివారం – తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో) వీచే అవకాశం ఉంది.

రాయలసీమ ప్రాంతంలో.. 

గురువారం నాడు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగం తో)వీచే అవకాశం ఉంది.

శుక్రవారం, శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)వీచే అవకాశం ఉంది.