Home / latest ap news
విశాఖ స్టీల్ ప్లాంట్ లో తెలంగాణ సింగరేణి కాలరీస్ అధికారులు బృందం రెండో రోజు పర్యటిస్తోంది.. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనంలో అధికారులను బృందం కలుసుకుంది. స్టీల్ ప్లాంట్ లోపల కూడా అధికారుల బృందం పర్యటిస్తోంది. ఈ సాయంత్రం స్టీల్ ప్లాంట్ సీఎండీతో తెలంగాణ అధికారులు భేటీ అవుతారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొవడాన్ని
టీటీడీ నివారణ చర్యలకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం లోపు భక్తుల రద్దీ తగ్గక పోతే క్యూలెన్‌లో ఎంట్రీ నిలిపి వేయనున్నారు.
ఏ ఒక్క ఎమ్మెల్యేను, కార్యకర్తను తాను పోగొట్టుకోవాలని అనుకోనని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, రీజనల్ ఇన్ చార్జిలతో ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించారు
చిందేపల్లిలో జనసేన నేతల దీక్షను భగ్నం చేసిన తీరు ఆక్షేపణీయమన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. మూడు రోజులుగా చేస్తున్న నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసిన తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ముఖ్యంగా జనసేన నాయకురాలు కోట వినుత, ఆమె భర్త పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో మూడు రోజులుగా జనసేన ఇన్ చార్జ్ వినుత ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. చిందేపల్లిలో ఇసిఎల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆర్ అండ్ బి రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడంతో.. 17 గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి
ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి క్షేత్రంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 9 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగనున్నాయి.నవమి ముందు రోజు నుంచి 11 రోజుల పాటు ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన తరువాత పౌర్ణమిరోజు రాత్రి స్వామివారి కల్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
ఈ మేరకు విశాఖ సిటీని ముస్తాబు చేసిన అధికారులు.. మరోవైపు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవలే ఈ నెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను (జీఐఎస్) ఘనంగా నిర్వహిం అందరి దృష్టి ఆకర్షించిన ఏపీ సర్కార్.. ఇక, నేటి నుంచి జీ–20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది.
జగన్ సర్కార్ ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు నేడు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడో విడత సాయాన్ని విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని వైఎస్ జగన్ ఈరోజు జమ చేయనున్నారు.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటి నిల్వలపై పార్లమెంట్ సాక్షిగా కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చి చెప్పింది. పార్లమెంట్ లో వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వచేయనున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మృతి చెందినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.