Home / landslide
నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో రెండు ప్రయాణీకుల బస్సులు నదిలో కొట్టుకుపోయాయి.రెండు బస్సులు 65 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నాయి. గల్లంతయిన వారిలో ఏడుగురు బారతీయులు ఉన్నారు.
ఇండోనేషియాలోని సెంట్రల్ ద్వీపం సులవేసిలో ఒక అక్రమ బంగారు గని సమీపంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 11 మంది మరణించగా 19 మంది తప్పిపోయినట్లు ఒక అధికారి తెలిపారు.
మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో కొండచరియలు విరిగి పడి సుమారు పది మంది మృతి చెందారు. జాతీయ రహదారి 6పై హంతూరు వద్ద రోడ్డుపై పెద్ద ఎత్తున బండ రాళ్లు పడ్డంతో జాతీయ రహదారి ధ్వంసం అయ్యింది.
పవువా న్యూ గినియాలో కొండచరియలు విరిగి పడి సుమారు 2,000 మంది కంటే ఎక్కువ మంది మట్టి పెళ్లలో కూరుకుపోయారని అక్కడి జాతీయ విపత్తు కార్యాలయం వెల్లడించింది. అయితే రెస్క్యూ వర్కర్స్ మట్టి పెళ్లలో కూరుకుపోయిన వారిని బయటికి తీయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు, దుకాణాలు ధ్వసం అయ్యాయి. 19 మంది గల్లంతు కాగా వీరిలో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 16 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కొలంబియాలో తూర్పు మైదానాలకు బొగోటాను కలిపే కీలకమైన హైవే పై కొండచరియలు విరిగిపడి చేరిన బురద తో 15 మంది మరణించారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఈ ప్రాంతంలో మూడు వాగులు పొంగి పొర్లుతున్నాయి.
ఆదివారం నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో పద్నాలుగు మంది మరణించారు మరియు ఐదుగురు తప్పిపోయినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది.లెషాన్ నగరానికి సమీపంలోని జిన్‌కౌహేలోని ప్రభుత్వ యాజమాన్యంలోని అటవీ స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అని స్థానిక ప్రభుత్వం ఆన్‌లైన్ ప్రకటనలో తెలిపింది.
: ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలో ఒక ప్రధాన రహదారి కొండచరియలు విరిగిపడటంతో కనీసం 300 మంది ప్రయాణీకులు చిక్కుకుపోయారు. ధార్చుల ఎగువన 45 కిలోమీటర్ల దూరంలోని లఖన్‌పూర్‌లో ఉన్న లిపులేఖ్-తవాఘాట్ మార్గం 100 మీటర్ల మేర కొట్టుకుపోయి, రోడ్డుపై పడడంతో ప్రయాణికులు ధార్చుల మరియు గుంజిలో చిక్కుకున్నారని జిల్లా యంత్రాంగం తెలిపింది.