Last Updated:

Uttarakhand Landslide: ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి.. 16 మంది గల్లంతు.

గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు, దుకాణాలు ధ్వసం అయ్యాయి. 19 మంది గల్లంతు కాగా వీరిలో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 16 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Uttarakhand Landslide: ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి.. 16 మంది గల్లంతు.

Uttarakhand Landslide: గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు, దుకాణాలు ధ్వసం అయ్యాయి. 19 మంది గల్లంతు కాగా వీరిలో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 16 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

గౌరీకుండ్ ఏరియా సమీపంలో పలు దుకాణాలు కొట్టుకుపోయాయి.నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) ద్వారా సహాయ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒక అధికారి తెలిపారు.భారీ వర్షాలు, కొండలపై నుంచి అడపాదడపా పడిపోతున్న బండరాళ్లు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని సర్కిల్ ఆఫీసర్ విమల్ రావత్ తెలిపారు.నేపాల్‌కు చెందిన కొందరితో సహా తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నేడు భారీ వర్ష సూచన..(Uttarakhand Landslide)

గల్లంతైన వారిలో వినోద్ (26), ములాయం (25), అషు (23), ప్రియాంషు చమోలా (18), రణబీర్ సింగ్ (28), అమర్ బోహ్రా, అతని భార్య అనితా బోహ్రా, వారి కుమార్తెలు రాధిక బోహ్రా మరియు పింక్ బోహ్రాగా గుర్తించారు. , మరియు కుమారులు పృథ్వీ బోహ్రా (7), జటిల్ (6), వకీల్ (3) అని అధికారులు తెలిపారు.మరోవైపు శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పౌరీ, టెహ్రీ, రుద్రపరాయాగ్, డెహ్రాడూన్‌లలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.చమోలి, నైనిటాల్, చంపావత్, అల్మోరా మరియు బాగేశ్వర్‌లకు ఎల్లో అలర్ట్ (మధ్యస్థ-తీవ్రత వర్షపాతాన్ని సూచిస్తుంది) జారీ చేయబడింది.