Home / Kuppam
ఎవరైతే నాకేంటి..సీఎం అయినా...పీఎం అయినా ఐ డోంట్ కేర్..లంచం ఇస్తేనే పని అవుతుంది. పచ్చనోట్లు చేతిలో పడితేనే పని. లేకపోతే ఫైల్ పెండింగే..లంచం ఇవ్వండి..మీకు కావాల్సిన ఫైల్స్ పై సంతకాలు పెట్టించుకోండి. నేనింతే..ఎవరేమనకున్నా నా రూటే సెపరేట్ అంటున్నాడు ఓ అధికారి.
Kuppam Accident: ఆ విద్యార్ధులు ఉన్నత చదువులు చదివారు. త్వరలోనే ఉద్యోగాలు చేయాలని కలలు కన్నారు. కానీ అంతలోనే వారి ఆశలను విధి ఛిదిమేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వారిని కన్నవారికి దూరం చేసింది. తమ కొడుకులు మంచి ఉద్యోగాలు సాధించి.. సమాజంలో గొప్పగా జీవిస్తారని అనుకున్నా తల్లిదండ్రుల కలలను తుంచేసింది.
Tarakaratna Health: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. బాలకృష్ణ తెలిపారు. ఆయన ఆరోగ్యంపై బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. మరింత మెరుగైన వైద్యం కోసం.. తారకరత్నను బెంగళూరు తరలిస్తే బావుంటుందని వైద్యులు సూచించారని ఈ సందర్భంగా అన్నారు.
Yuvagalam: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న మధ్యలో అస్వస్థతకు గరుయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ పాదయాత్ర చేపట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పంలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఏర్పాట్లకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే మంత్రికి లేఖ వ్రాశారు. కుప్పంలో వందే భారత్ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు.
మాజీ సర్పంచ్ సచివాలయం గుమ్మానికే ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చెంగుబళ్ల పంచాయతీ మాజీ సర్పంచ్ గోపాల్ తన పొలానికి దారి సమస్య పరిష్కారం కోరుతూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు నాయుడు 14ఏళ్లుగా సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువు సమస్యను పరిష్కరించలేకపోయారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు
చంద్రబాబు ఇలాఖా అయిన కుప్పంలో నేడు సీఎం జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్ఆర్ చేయూత మూడో విడత నగదును విడుదల చేశారు. అంతేకాదు కుప్పం నుంచి మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పింఛన్ పెంపును అమలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారి జగన్ కుప్పంకు రానున్నారు. సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసారు. వచ్చే ఎన్నికల పైన ఇప్పటికే ఫోకస్ చేసిన సీఎం జగన్ 175 సీట్లలో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు.