Home / Kuppam
కుప్పం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం. ఏళ్ల తరబడి గెలుస్తూ వస్తున్న నియోజకవర్గం. బాబు ఇక్కడ ఎన్నికల సమయంలో నామినేషన్ మాత్రం వేసి వెళ్లిపోతారు. ప్రచారం, పోలింగ్ అంతా స్దానిక నేతలే చూసుకుంటారు.
చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్‌పై మున్సిపల్ వైస్ ఛైర్మన్ మునిస్వామి మారణాయుధాలతో దాడికి దిగాడు. ఈ ఘటనలో మురుగేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సానుభూతి పరులు రెచ్చిపోయారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్ పై అర్థరాత్రి దాడి చేశారు. ఫ్లెక్సీలను చించేయడంతో పాటు అక్కడి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పై దాడి
టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో లో మూడో రోజు పర్యటిస్తున్నారు. కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు తిరగబడితే సీఎం జగన్ బయట తిరగలేరన్నారు.
టీడీపీ వర్సెస్ వైసీపీ .. కుప్పంలో రాజకీయ రచ్చ.. | HotTopic With Journalist Sai | Prime9 News
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేడు చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.