Home / komatireddy rajagopal reddy
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసారు. ఈ మేరకు ఆయన పార్టీకి తన రాజీనామా లేఖను పంపించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. కొద్దినెలల కిందట కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేసి ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే.
Komatireddy Rajagopal Reddy: రెండు మూడు రోజులుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారనేది ఈ వార్త సారాంశం.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. మునుగోడులో గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రెండు గంటలకు పైగా రోడ్డు పై బైఠాయించడంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మునుగోడు ఉపఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
వ్రతం చెడ్డా ఫలితం దక్కని వైనంగా మారింది కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి.
మునుగోడు ఉపఎన్నికల ప్రచారం వాడీవేడిగా జరుగుతుంది. నేటితో ఈ ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ను గద్దె దింపే వరకు తన పోరాటం ఆగదని, కేసీఆర్ను ఓడిస్తానని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి శపథం చేశారు. మునుగోడులో తాను గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 15 రోజుల్లో పడగొడతామని సంచలన కామెంట్లు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు నియోజరవర్గంలో జరిగే ఉప ఎన్నికల కోసం అధికార ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలే కాకుండా భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డిపై చెప్పుతో దాడికి ప్రయత్నించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు రూపంలో దక్కించుకున్న రూ. 18 వేల కోట్లను మునుగోడు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తే.... తాము మునుగోడు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం కేసిఆర్ మాట్లాడే మాటలు, బ్రోకర్ మాటలుగా భాజపా శాసనసభ్యులు ఈటెల రాజేందర్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో హుషారుగా, జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఈటెల సీఎం కేసిఆర్ పరిపాలన తీరును ప్రజలకు తెలియచేస్తున్నారు.
సీఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈ సారి చంచల్ గూడ లేదా తీహార్ జైల్లో బతుకమ్మ ఆడుతారని మునుగోడు ఉపఎన్నిక భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు