Home / komatireddy rajagopal reddy
ఈ ఏడాది చివరిలో జరగనున్న మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక నేపధ్యంలో ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఒక పార్టీ మీద ఒకరు ఆరోపణలు గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు
రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం కేసీఆర్ అంటూ మాజీ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అధికార, విపక్షాల నడుమ మాటల యుద్దం నడుస్తుంది.
అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్షాన్ని బలహీన పరిచారని ఫైరయ్యారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన కొన్ని పోస్టర్ల కలకలం రేపుతున్నాయి.
ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి తన రాజీనామా లేఖను సమర్పించారు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ సమర్పించారు. దీనికి ముందు అసెంబ్లీ రోడ్డులోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తన రాజీనామా లేఖను మీడియా సమక్షంలో అందరికి చూపించారు.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై తానేమీ స్పందించబోనని ఆయన సోదరుడు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ ఆఫీసును ఈడీ సీజ్ చేయడంపై ఢిల్లీలో ఎంపీలు ధర్నా చేశారు. ఈ ధర్నాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
తాను కాంట్రాక్ట్‌ల కోసం అమ్ముడుపోయానని ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, వాటిని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నిరూపించకుంటే రేవంత్ రెడ్డి పీసీసీకి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అని ఓపెన్ చాలెంజ్ చేశారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవితవ్యం పై కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్స్టాప్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. త్వరలో స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు. మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.