Home / Khammam
ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. తన పొలాన్ని కొందరు జేసీబీలు, బుల్డోజర్లతో దున్ని ధ్వంసం చేశారని అధికారులకు మొర పెట్టుకున్నా..పట్టించుకోక పోవడంతో.. ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. ఏ పార్టీ చరిత్ర ఏంటో ప్రజలు బాగా ఆలోచించాలి. మీ ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం, కొత్తగూడెం లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు.
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ను సాగనంపాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా సభ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపు నిచ్చారు.
బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేసారు. ఆదివారం సాయంత్రం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ను బీజేపీ కి బి టీమ్ గా అభివర్ణించారు.
నేడు ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ జనగర్జన సభ జరగనుంది. ఈ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హజరుకానున్నారు. జూపల్లి పొంగులేటితో పాటు పలువురు నాయకులు హస్తం గూటికి చేరటంతో పాటు. పార్టీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ఈ సభతో ముగియబోతుంది.
ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వేళ ఆయన అనుచరులపై పోస్టర్లు వెలిశాయి. మంత్రి పువ్వాడ అజయ్ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగకపోతే చంపేస్తామని, శవాన్ని దొరకనీయబోమని పొంగులేటి అనుచరుడు మువ్వా విజయ్బాబుని హెచ్చరించారు.
మాజీ ఎంపీ , బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడం గురించి 3, 4 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని పొంగులేటి తెలిపారు. ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు.
: ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేయాలనుకుంటున్న కృష్ణుడి రూపంలోని ఎన్టిఆర్ విగ్రహం అంశంలో తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 28న విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పువ్వాడ అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా కారేపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. తాజాగా మరొకరు మరణించారు.
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు గూగులమ్మను నమ్ముకొని బతకటం ఇవాల్టి రోజుల్లో అలవాటుగా మారింది. కొత్త ప్లేస్ కు వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్ ను పెట్టుకొని వెళ్లటం అంతకంతకూ అలవాటుగా మారింది.