Last Updated:

NTR Statue: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే

: ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేయాలనుకుంటున్న క‌ృష్ణుడి రూపంలోని ఎన్‌టిఆర్ విగ్రహం అంశంలో తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 28న విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పువ్వాడ అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు.

NTR Statue:  ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే

NTR Statue: ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేయాలనుకుంటున్న క‌ృష్ణుడి రూపంలోని ఎన్‌టిఆర్ విగ్రహం అంశంలో తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 28న విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పువ్వాడ అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ విగ్రహం ఏర్పాటు చేయకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విగ్రహ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ శ్రీ కృష్ణ జాక్, ఆదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘం తదితర సంఘాలు 14 పిటిషన్లు దాఖలు చేశాయి. వాదనలు విన్న హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని ఆదేశించింది. ఎన్‌టిఆర్ విగ్రహాన్నైనా పెట్టండి.. లేదంటే కృష్ణుడి విగ్రహాన్నైనా పెట్టుకోండని హైకోర్టు సూచించింది.

శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహం వద్దు..(NTR Statue)

దివంగత ఎన్టీరామారావు శతజయంతి సందర్బంగా శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహావిష్కరణకు ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ కూడా హాజరయ్యేందుకు అంగీకరించారు. అయితే కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడంపై పలు కుల సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీనిపై హైకోర్టు అప్పీలు చేసింది. విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విగ్రహావిష్కరణ జరపరాదని ఆదేశించింది.

శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు తాము వ్యతిరేకం కాదని, కృష్ణుడి రూపంలో పెట్టడం సరికాదని వాదిస్తున్నారు. ఓట్ల కోసమే శ్రీకృష్ణుడి స్వరూపాన్ని ఏర్పాటు చేస్తున్నారని యాదవ, కమ్మ సామాజికవర్గాలు ఆరోపిస్తున్నాయి.ఈ విగ్రహ ప్రతిష్ఠాపనపై నటి కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఆ మహానుభావుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడమంటే అందరికీ ఇష్టమే. కానీ తారకరాముడి విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో తయారు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు.