Home / Kaleswaram project
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కొనసాగించకుండా... కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేశారనే రికార్డులు పరిశీలిస్తున్నామని కాలేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ ఘోష్ అన్నారు. హైదరాబాద్ లో విలేకరులతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ను శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు సందర్శించారు. హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు వెళ్లారు. అధికారులతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను పరిశీలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని.. తెలంగాణలో లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత ప్రమాదకర స్థితికి చేరింది. 20వ పిల్లర్ డ్యామేజి అయినట్లుగా అధికార యంత్రాంగం గుర్తించింది. దీంతో గంట గంటకీ 6వ బ్లాక్ కుంగిపోతోంది. 19, 20వ పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ తెలంటాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణను లిక్కర్ రాష్ట్రంగా మార్చారని షర్మిల విమర్శించారు.
తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ఒక రోజు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలంగాణ సర్కార్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఘాటు విమర్శులు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలోనే అతిపెద్ద స్కాం అని ఆమె పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీబీఐకు ఫిర్యాదు చేసారు. దీనిపై త్వరగా విచారణ జరపాలంటూ నేడు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.