Home / Jharkhand
Maharashtra, Jharkhand Exit Poll Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 వరకు మహారాష్ట్రలో 58.22శాతం, ఝార్ఖండ్‌లో 67.59 శాతం పోలింగ్ నమోదైంది. క్యూ లైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఓటేసిన రాజకీయ, సినీ ప్రముఖులు మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో […]
Maharashtra, Jharkhand Assembly Elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా.. మహారాష్ట్రలో 9 గంటల వరకు 6.61శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఝార్ఖండ్‌లో 12.71శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. ఝార్ఖండ్‌లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అలాగే యూపీలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో […]
Election Campaign Ended In Jharkhand And Maharashtra: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. సోమవారం సాయంత్రానికి రెండు రాష్ట్రాల్లో క్యాంపెయినింగ్ పూర్తయింది. 48 గంటల సైలెంట్ పీరియడ్ తర్వాత 20వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో రేపు (నవంబరు 20) పోలింగ్ జరగనుంది. ఇక, జార్ఖండ్‌లో తొలివిడతలో 43 సీట్లకు నవంబరు 13న పోలింగ్ జరగగా, రెండవ విడతలో భాగంగా 38 స్థానాలకు […]
నీట్-యూజీ ప్రశ్నాపత్రం మొదట జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో లీక్ అయిందని తరువాత బీహార్ వెళ్లిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ) తెలిపింది. బీహార్‌లో మొదట ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మొదట భావించారు. పేపర్ లీక్ కు సంబంధించి పలువురిని అక్కడ అదుపులోకి తీసుకున్నారు.
:జార్ఖండ్ మంత్రి అలమ్‌గిర్ ఆలమ్ సెక్రటరీ నుంచి ఈడీ అధికారులు ఏకంగా రూ.30 నుంచి రూ.40 కోట్లు వసూలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేవలం రూ.10వేల లంచం కాస్తా రూ.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జార్ఖడ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం దాడులు నిర్వహిస్తోంది. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ గృహ సహాయకుడి ఆవరణలో సోదాల్లో సుమారు రూ. 20 కోట్ల నగదు లభించింది.
జార్ఖండ్‌లోని రాంచీలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఆమె స్కూల్ టీచర్ అత్యాచారానికి పాల్పడి దానిని చిత్రీకరించి, వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. సమీద్ కశ్యప్ అనే నిందితుడు బాధితురాలిని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఘోరం చోటు చేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది బొగ్గు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) యొక్క కార్మికులు, మద్దతుదారులు మరియు సహచరులపై అణిచివేతలో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ గురువారం బీహార్ మరియు జార్ఖండ్‌లోని 14 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
జార్ఖండ్ తన మొదటి ఎయిర్ అంబులెన్స్ సేవలను శుక్రవారం ప్రారంభించింది. అంబులెన్స్ సర్వీసులు రాంచీతో పాటు మరో ఆరు నగరాల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం యొక్క ఈ చర్య రాష్ట్రంలో వైద్య రవాణా సౌకర్యాలను పెంచి, అవసరమైతే ఇతర గమ్యస్థానాలకు అనుసంధానిస్తుంది