Home / Janasena leaders
ఏపీలో జనసేన మంచి స్పీడుతో దూసుకెళ్తోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే వరుస కార్యక్రమాలతో జనసైనికుల్లో జోష్ నింపుతున్నారు పవన్. ఇకపోతే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నేడు పీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.
రాష్ట్రంలోని 13మంది వైసీపీ ప్రజా ప్రతినిధులపై జనసేన పార్టీ శ్రేణులు దాడులు చేసే అవకాశం ఉందంటూ పోలీసు ఇంటిలిజెన్స్ నివేదికపై అధికార పార్టీ కుట్రలు తిప్పి కొట్టాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ అప్రమత్తం చేశారు.
ఇటీవల విశాఖలో జనసేనాని పర్యటన సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలతో పలువురు జనసైనికులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా వారంతా ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమాలు ఎక్కవయ్యాయని వాటిని ప్రశ్నించడానికి విశాఖకు వచ్చిన జనసేనాని స్వాగతించడం తమ కర్తవ్యంగా భావించి ఎయిర్ పోర్టుకు చేరుకున్నామని.. దానిని జీర్ణించుకోలేని ఈ కుటిల ప్రభుత్వం తమను జైలుపాలు చేసిందని జనసైనికులు ఆరోపించారు.
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు.
జనసైనికులకు కోర్ట్ షాక్ ఇచ్చింది. విశాఖ ఎయిర్పోర్టులో మంత్రులపై జరిగిన దాడి కేసులో అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తలకు కోర్టులో షాక్ తగిలింది.
అరెస్ట్ చేసిన వారిలో 9 మంది పార్టీ నేతలకు రిమాండు విధింపు.జనసేన నేతలను కోర్టుకు తీసుకొచ్చే సమయంలో గేట్లు దిగ్బంధం చేశారు.
విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో జనసైనికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఏడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రుల కార్లపై రాళ్ల దాడి కేసులో జనసేన నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు.