Home / Iran
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అజర్ బైజాన్‌కు వెళ్లి వస్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. నిన్న వాతావరణ అనుకూలించక హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది
ఇరాన్‌లోని సిస్తాన్ అండ్ బలూచిస్థాన్ ప్రావిన్స్‌పై పాకిస్తాన్ ప్రతీకార దాడుల్లో ముగ్గురు మహిళలు మరియు నలుగురు పిల్లలతో సహా కనీసం ఏడుగురు మరణించారని ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అలీరెజా మర్హమతి స్టేట్ టీవీలో తెలిపారు. పాకిస్తాన్ దాడిలో మరణించిన వ్యక్తులు ఇరాన్ పౌరులు కాదని మర్హమతి చెప్పారు.
ఇరాన్ దేశ రాయబారిని తమ దేశం నుంచి పాకిస్థాన్ బహిష్కరించింది. తమ దేశానికి చెందిన రాయబారిని కూడా ఇరాన్ వదిలి వచ్చేయాలని కోరింది. తమ భూభాగంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులో ఇరాన్ దాడులు జరపడం చట్ట విరుద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఛాబహార్ ఓడరేవును మరింత అభివృద్ధి చేయడానికి భారతదేశం, ఇరాన్ సోమవారం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. విదేశాంగ మంత్రి జై శంకర్ టెహ్రాన్ పర్యటన సందర్భంగా ఇరాన్ రోడ్లు మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మెహర్దాద్ బజర్పాష్‌తో విస్తృత చర్చలు జరిపిన నేపధ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. జైశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసారు.
ఇరాన్లో బుధవారం జంట పేలుళ్ల కారణంగా 73 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. 2020 యుఎస్ డ్రోన్ దాడిలో మరణించిన టాప్ కమాండర్ ఖాసిమ్ సులేమాని సంస్మరణ వేడుకలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ అత్యవసర సేవల ప్రతినిధి బాబాక్ యెక్తపరాస్ట్ 73 మంది మరణించారని, 170 మంది గాయపడ్డారని తెలిపారు.
భారత్‌తో సహా 33 దేశాల పర్యాటకులకు వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం మరియు హస్తకళల మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి ప్రకటించారు. పర్యాటకుల రాకపోకలను పెంచడానికి మరియు ఇతర దేశాల నుండి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకోబడింది.
శుక్రవారం తెల్లవారుజామున ఆగ్నేయ ఇరాన్‌లోని ఒక పోలీసు స్టేషన్‌పై బలూచ్ మిలిటెంట్లు చేసిన దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది మరణించగా పలువురు గాయపడ్డారు.సిస్తాన్-బలుచెస్తాన్ప్రావిన్స్లోని రాస్క్ పట్టణంలో జరిగిన ఈ దాడిలో తీవ్రవాద జైష్ అల్-అడ్ల్ గ్రూపులోని పలువురు సభ్యులు కూడా మరణించారు.
ప్రస్తుతం ఇరాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నోబెల్ శాంతి బహుమతి విజేత నర్గిస్ మొహమ్మది సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను జైలు అధికారులు ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించలేదు. అధికారుల చర్యను నిరసిస్తూ ఆమె ఈ దీక్షను ప్రారంభించారు.
ఉత్తర ఇరాన్‌లోని మాదకద్రవ్యాల పునరావాస కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారుగా 32 మంది మరణించగా 16 మంది గాయపడ్డారు.గిలాన్‌లోని కాస్పియన్ సీ ప్రావిన్స్‌లోని లంగర్డ్‌లోని ఓపియం పునరావాస శిబిరంలో అగ్నిప్రమాదానికి గల కారణాలపై న్యాయవ్యవస్థ విచారణ జరుపుతోందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్ద తెలిపింది.
నిర్బంధ దుస్తుల కోడ్‌ను ధిక్కరిస్తున్న మహిళల సంఖ్య పెరగడాన్ని నియంత్రించేందుకు ఇరాన్ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో కెమెరాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిద్వారా హిజాబ్ ధరించని మహిళలను గుర్తించి జరిమానా విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు ప్రకటించారు.