Home / Iran
ఇరాన్లో నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజురోజు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజూ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో రోడ్డెక్కారు. ఇప్పటి వరకు సుమారు 50 మంది మృతి చెందారు.
ఇరాన్‌లోనూ హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా నిరసన సెగలు వెల్లువెత్తాయి. హిజాబ్ ధరించనందుకు మహసా అమిని అనే యువతి ఆ దేశ పోలీసుల దాడిలో గత శనివారం మృతి చెందింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఇరాన్ నిరసనలతో అట్టుడుకుతుంది. అయితే వీటిని అణచివేసేందుకు ఇరాన్ భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అణచివేతలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 31 మంది మరణించినట్లు ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్నఎన్జీనో సంస్థ వెల్లడించింది.