Home / Iran
Israeli attack on Iran’s Nuclear Facilities: పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించగా, రెండుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా ఐదోరోజూ కూడా ప్రతిదాడులతో రెండుదేశాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. టెహ్రాన్‌లోని తమ పౌరులను స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే 110 మంది భారతీయ విద్యార్థులు ఇరాన్‌ను వీడి అర్మేనియాకు క్షేమంగా చేరుకున్నారు. ప్రత్యేక […]
Iran attacked on Israel US embassy: అమెరికాను ఇరాన్ కవ్విస్తోందనే అనుమానాలు వస్తున్నాయి. తాజాగా టెల్ అవీవ్ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో అమెరికా దౌత్య కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఇరాన్ పై అమెరికా ప్రతి దాడులు చేస్తుందా అనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇందులో తాజాగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ […]
Iran – Israel War moving towards Nuclear War: పశ్చిమాసియా పరిణామాలు ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అణు బాంబుల ప్రస్తావన వచ్చింది. ఇజ్రాయెల్ తమపై అణుబాంబులు ప్రయోగిస్తే, పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందన్నారు ఇరాన్ టాప్ మిలటరీ ఆఫీసర్ మెహసిన్ రెజాయ్. అణు యుద్ధం..!! ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నా యావత్ ప్రపంచాన్ని వణికించే పదం ఇది..! పశ్చిమాసియాలో తాజా పరిణామాలను చూస్తుంటే అణు యుద్ధం వస్తుందన్న […]
Israeli Military apologises to India: ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకరస్థాయిలో విరుచుకుపడింది. ఇరాన్ కూడా అంతేస్థాయిలో ప్రతిదాడులు చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన ఓ పోస్టు భారతీయులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో ఐడీఎఫ్ క్షమాపణలు చెప్పింది. టెహ్రాన్‌పై వైమానిక ఐడీఎఫ్ దాడులకు దిగింది. శుక్రవారం రాత్రి తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇరాన్‌కు ఇజ్రాయెల్ […]
Trump warning to iran: అణు ఒప్పందంపై మరోసారి ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. ఇరాన్ తో అణు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నించి ట్రంప్ ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా అణు ఒప్పందంపై ఇరాన్‌కు ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదని.. ఇకనైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. పరిస్థితి చేయి దాటకముందే తమతో చర్చలు జరపాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై […]
Iran : ఇరాన్ అణు సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాజాగా అణు ఒప్పందంపై ఇరాన్‌ను ట్రంప్ మరోసారి హెచ్చరించారు. దాడులతో సాధించేదేమీ లేదని, ఇప్పటికైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని కోరారు. పరిస్థితి చేయి దాటకముందే చర్చలు జరపాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల తర్వాత ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమతో ఒప్పందం […]
Israel Military Strike on Iran: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ పై దాడులకు దిగింది. న్యూక్లియర్ సెంటర్స్, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఇవాళ ఉదయం దేశ రాజధానిలో పేలుళ్ల శబ్ధం వినిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నట్టు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. కాగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తిప్పికొట్టందుకు ఇరాన్ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపింది. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ […]
Donald Trump: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయబోతుందని ఇప్పటికే అమెరికా హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్, ఇరాక్ లో ఉన్న తమ వారంతా ఖాళీ చేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. కాగా పశ్చిమాసియా ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమని.. తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. దీంతో ఇరాన్ లో ఏదో జరగబోతుందన్న సంకేతాలు […]
Trump spoke with Israeli Prime Minister : ఇరాన్‌పై దాడులు ఆపాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. గతవారమే నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. ఇరాన్‌తో జరుగుతున్న అణు చర్చలకు అంతరాయం కలిగించేలా సైనిక చర్య ఉండకూడదని సూచించినట్లు మీడియాతో వెల్లడించారు. తాము ఒక పరిష్కారానికి దగ్గరగా వస్తున్నామని, ఇప్పుడు ఇలా చేయడం ఏమాత్రం సరికాదని ఇజ్రాయెల్ ప్రధాని సూచించినట్లు ట్రంప్ చెప్పారు. ఒక్క ఫోన్‌కాల్‌తో […]
3 Indians missing in Iran: ఇరాన్లో ముగ్గురు భారతీయులు మిస్సింగ్ అయ్యారు. విషయాన్ని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అదృశ్యమైన ముగ్గురి కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొంది. తప్పిపోయిన వారు పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందిన హుషన్ప్రీత్సింగ్, ఎస్బీఎస్ నగర్‌కు చెందిన జస్పాల్సింగ్, హోషియాపూర్‌కు చెందిన అమృత్‌పాల్ సింగ్‌గా గుర్తించారు. ఈ నెల 1వ తేదీన టెహ్రాన్‌లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైనట్లు ఎంబసీ తెలిపింది. ముగ్గురు యువకుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, ఎప్పటికప్పుడు […]