Home / Indian students
2021-22 విద్యా సంవత్సరంలో 200,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్‌ను తమ ఉన్నత విద్యా గమ్యస్థానంగా ఎంచుకున్నారు.
అమెరికా జారీ చేసిన స్టూడెంట్ వీసాల్లో అధికభాగం భారతీయ విద్యార్థులకే లభించాయి. 2022 సంవత్సరానికి గాను 82 వేల మంది భారతీయ విద్యార్ధులకు మనదేశంలోని యూఎస్ మిషన్‌లు స్టూడెంట్ వీసాలను జారీ చేశాయి.ఇది ప్రపంచంలోనే ఇతర దేశాల కంటే ఎక్కువ.
యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన భారత వైద్య విద్యార్థులు ఇప్పుడు ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లో చేరి వారి చదువును పూర్తి చేయవచ్చు. ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జాతీయవైద్యమండలి ఉక్రెయిన్ అందించే అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్‌ను గుర్తించడానికి అంగీకరించింది.
కరోనా సమయంలో భారత్‌కు వచ్చి ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా ఇక్కడే ఉండిపోయిన విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని కొనసాగించవచ్చని చైనా తెలిపింది. వీరితోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు చైనాకు వచ్చేందుకు వీలుగా త్వరలో వీసాలు జారీ చేయనున్నామని చైనా ప్రకటించింది.