China: భారత విద్యార్దులకు చైనా ఆహ్వానం
కరోనా సమయంలో భారత్‌కు వచ్చి ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా ఇక్కడే ఉండిపోయిన విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని కొనసాగించవచ్చని చైనా తెలిపింది. వీరితోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు చైనాకు వచ్చేందుకు వీలుగా త్వరలో వీసాలు జారీ చేయనున్నామని చైనా ప్రకటించింది.
China: కరోనా సమయంలో భారత్‌కు వచ్చి ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా ఇక్కడే ఉండిపోయిన విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని కొనసాగించవచ్చని చైనా తెలిపింది. వీరితోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు చైనాకు వచ్చేందుకు వీలుగా త్వరలో వీసాలు జారీ చేయనున్నామని చైనా ప్రకటించింది. చైనా నుంచి భారత్‌కు వెళ్లిన దాదాపు 23,000 మంది భారతీయ విద్యార్థులు కొవిడ్ ఆంక్షల వల్ల అక్కడే చిక్కుకుపోయారని అంచనా. వీరిలో ఎక్కువమంది వైద్య విద్యార్థులే. చదువు పూర్తి చేయడానికి వెంటనే తిరిగి చైనాకు రాదలచుకున్నవారి జాబితాను చైనా ఇటీవలే అడిగి తీసుకుంది. శ్రీలంక, పాకిస్థాన్, రష్యా సహా వివిధ దేశాల నుంచి విద్యార్థులు ఇటీవలి కాలంలో ప్రత్యేక విమానాల్లో చైనాకు చేరుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా చైనాకు వెళ్లేవారు విశ్వవిద్యాలయాలు తమకు జారీ చేసిన ప్రవేశ పత్రాన్ని వీసా నిమిత్తం సమర్పించాలి. పాత విద్యార్థులైతే విశ్వవిద్యాలయ ప్రాంగణానికి తిరిగి వచ్చేందుకు చైనా జారీ చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలి. ప్రస్తుతానికి చైనాకు నేరుగా విమానాలు లేకపోవడం మాత్రం సమస్యగా నిలవనుంది. విమానాలు నడపడం పై రెండు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి.
చైనాలో దాదాపు 23,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే గత రెండేళ్లలో అక్కడ కరోనా విజృంభించడంతో విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం మళ్లీ చైనాలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థుల జాబితాను డ్రాగన్ కంట్రీ అడగడంతో భారత్ అందుకు సంబంధించిన వివరాలను సమర్పించింది. అయితే చైనాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు కరోనా ఆంక్షలతో గత రెండేళ్లుగా స్వదేశంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో మధ్యలో ఆగిన చదువులు తిరిగి కొనసాగించేందుకు వీలుగా, వీసా జారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చైనా ప్రకటించింది. విద్యార్థుల వీసాలతోపాటు పర్యాటకం, బిజినెస్ వీసాలను కూడా జారీ చేయనున్నట్లు చైనా తెలిపింది. విద్యార్థులు, వ్యాపారవేత్తలు, చైనాలో పనిచేస్తున్న కుటుంబాలకు సంబంధించిన వీసాలు కూడా జారీ చేయనున్నట్లు న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ ప్రకటన జారీ చేసింది. దీంతో మధ్యలోనే ఆగిన తమ చదువులను కొనసాగించేదుకు, కొత్తగా ఉన్నత చదువుల కోసం చైనాకు వెళ్లాలనుకునేవారికి చైనా X1 వీసాలను జారీ చేయనుంది.
చైనా ప్రభుత్వ నిర్ణయంతో వైద్య విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ విద్యాసంవత్సరం వృథా అయిపోయిందని భావిస్తున్న వేలాది మంది విద్యార్థులు చైనా ప్రభుత్వ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు.