Last Updated:

Canada: కెనడా నుంచి బహిష్కరణకు గురైన 700 మంది భారతీయ విద్యార్థులు

ఉన్నత విద్యను కోసం భారత్‌ నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు యూరప్‌ దేశాలకూ ఇండియన్ స్టూడెంట్స్ క్యూ కడుతున్నారు.

Canada: కెనడా నుంచి బహిష్కరణకు గురైన 700 మంది భారతీయ విద్యార్థులు

Canada: ఉన్నత విద్యను కోసం భారత్‌ నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు యూరప్‌ దేశాలకూ ఇండియన్ స్టూడెంట్స్ క్యూ కడుతున్నారు.

 

స్టూడెంట్స్ కు డిపార్టేషన్‌ లెటర్లు(Canada)

ఈ క్రమంలో కెనడా విద్యా సంస్థల్లో అడ్మిషన్‌ కోసం ఇచ్చిన ఆఫర్‌ లెటర్లలో కొన్ని నకిలీ(Fake Offer Letter) వి ఉన్నట్లు కెనడా అధికారులు గుర్తించారు.

దీంతో సదరు విద్యార్థులకు కెనడియన్‌ బార్డర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సీబీఎస్ఏ డిపార్టేషన్‌ లెటర్లు కూడా అందించినట్లు తెలుస్తోంది.

దీంతో సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు కెనడా నుంచి బహిష్కరణను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.

 

ఒక్కో విద్యార్థి నుంచి 20 లక్షలు(Canada)

డిపార్టేషన్‌ లెటర్లు అందుకున్న కొందరు విద్యార్థులు చెబుతున్న వివరాల ప్రకారం.. పంజాబ్‌ జలంధర్‌కు చెందిన ఏజెంట్ బ్రిజేష్ మిశ్రా ఎడ్యుకేషన్‌ మైగ్రేషన్‌ సర్వీసెస్‌ నిర్వహిస్తున్నాడు.

కెనడాలోని ప్రముఖ కాలేజీలో అడ్మిషన్ ఫీజు, ఇతర ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ. 16 నుంచి రూ. 20 లక్షలు వసూలు చేశాడు.

దీంతో వారంతా 2018-19లో అడ్మిషన్‌ పొంది చదువులు కూడా పూర్తిచేశారు. అంతే కాకుండా వారిలో కొందరు ఉద్యోగాలూ సంపాదించి అక్కడే నివసిస్తున్నారు. ఇంతవరకు బాగానే నడిచింది.

కానీ ఇలా వెళ్లిన వారిలో కొందరు కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన సీబీఎస్‌ఏ.. వీసా కోసం కొందరు విద్యార్థులు సమర్పించిన దస్త్రాలు నకిలీవని గుర్తించింది.

పీఆర్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు భారతీయ విద్యార్థులు తమ ‘అడ్మిషన్ ఆఫర్ లెటర్’ ను సమర్పించారని, వాటి ఆధారంగా తమ వీసా జారీ చేసిన లేఖలు నకిలీవని తేలినట్టు తేలింది.

ఇవన్నీ జలంధర్‌ కేంద్రంగా ఉన్న ఆ కన్సల్టెన్సీవేనని.. 2018-2022 మధ్య కాలంలో అక్కడ నుంచి సుమారు 700 మంది కెనడాలో చదువులకు ఆఫర్‌ లెటర్లు పొందినట్లు సమాచారం.

ఈ తరహా భారీ మోసం వెలుగుచూడటం కెనడాలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది.

అయితే, బహిష్కరణను ఎదుర్కొంటున్న వారిలో పంజాబ్‌లోని జలంధర్‌ నుంచి వెళ్లిన వాళ్లే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు కెనడాలో తప్పుడు దస్త్రాల అంశానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జలంధర్‌ పోలీసులు చెబుతున్నారు.