Home / heroine latest photos
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ ఆడియెన్స్ నే కాకుండా సౌత్ ఆడియెన్స్ కు కూడా పిచ్చపిచ్చగా నచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఆ మూవీలో గ్లామర్ స్టెప్పులతో దుమ్ముదిలిపేసింది.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'అమిగోస్' మూవీ ద్వారా ఆషికా రంగనాథ్ టాలీవుడ్ కి హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయినా ఈ అమ్మడు మాత్రం తెలుగు ప్రజలకు బాగానే సుపరిచితం అయ్యారు.
పోవేపోరా ప్రోగ్రాంతో బుల్లితెరపై యాంకర్ విష్ణుప్రియ తన మార్క్ ను సెట్ చేసుకున్నారు. ఆ తర్వాత అనేక కార్యక్రమాల ద్వారా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షుకులలో మంచి గుర్తింపే తెచ్చుకుంది. యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ యాంకర్ గా ఆపై నటిగా మారారు. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక హీరోయిన్ గా నటించారు. రష్మీ, అనసూయ స్పూర్తితో కెరీర్లో ముందుకు వెళుతున్నారు విష్ణుప్రియ.
ఈషా రెబ్బ ఈ తెలుగమ్మాయి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమీతుమీ, పిట్టకథలు, అ, అరవిందసమేత వీరరాఘవ వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది. కానీ ఈ అమ్మడుకి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దానితో తమిళ్ మళయాలం మూవీలపై దృష్టి సారించింది.
కియారా అద్వానీ, మహేష్ బాబు నటించిన ‘భరత్ అను నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది.
2003లో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినీరంగానికి పరిచయం అయ్యారు త్రిష. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా సత్తాచాటారు.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రియాంకా అరుల్ మోహన్ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ తెలుగులో ఈ ముద్దుగుమ్మ అంతగా అవకాశాలు రాలేదు. అయితే తన సొంతగడ్డ అయిన తమిళంలో మాత్రం ఈ అమ్మడుకు అవకాశాలను బాగానే అందిపుచ్చుకుంది.
అందం అభినయమే అలంకారంగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వచ్చిన 'రొమాంటిక్' మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. కాగా తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన రంగరంగవైభవంగా అంటూ పలకరించినా ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి ఎంట్రీ ఇచ్చింది నందితా శ్వేత. హీరోయిన్ గానే కాకుండా సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ నందిత ప్రతిభకనపరుస్తోంది.
నాజూకు నడుము అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న అనుమప పరమేశ్వరన్. ప్రేమమ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత కెరీర్లో వెనక్కి తిరిగి చూడలేదు. హలోగురూ ప్రేమకోసమే, కార్తికేయ2 వంటి సూపర్ హిట్లు కొట్టి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల తార